తొమ్మిది నెలల రక్షణ!
close
Published : 27/07/2021 04:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తొమ్మిది నెలల రక్షణ!

కొవిడ్‌-19 బారినపడి, కోలుకున్నారా? అయితే కనీసం తొమ్మిది నెలల వరకు మళ్లీ ఇన్‌ఫెక్షన్‌ రాదనుకోవచ్చు. కొవిడ్‌-19కు కారణమయ్యే సార్స్‌-కొవీ-2ను ఎదుర్కొనే యాంటీబాడీల మోతాదులు 9 నెలల వరకూ ఎక్కువగానే ఉంటున్నట్టు తాజాగా బయటపడింది. గత సంవత్సరం ఫిబ్రవరి, మార్చిలో కొవిడ్‌-19 బారినపడ్డ కొందరిపై ఇటలీ, బ్రిటన్‌ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఇది వెల్లడైంది. వీరిలో 98.8% మందిలో తొమ్మిది నెలల తర్వాత కూడా యాంటీబాడీలు గుర్తించదగిన స్థాయిలో ఉంటున్నట్టు తేలింది. కొవిడ్‌ లక్షణాలు కనిపించినా, కనిపించకపోయినా యాంటీబాడీల సంఖ్య దాదాపు ఒకేలా ఉండటం విశేషం. కరోనా లక్షణాలు, జబ్బు తీవ్రతతో రోగనిరోధక ప్రతిస్పందన సామర్థ్యం ముడిపడి లేదనటానికిదే నిదర్శనం. కొందరిలో యాంటీబాడీలు మునుపటికన్నా పెరిగాయి కూడా. తిరిగి ఇన్‌ఫెక్షన్‌ బారినపడటం వల్ల రోగనిరోధక వ్యవస్థ మరింత ఉత్తేజితం కావటం దీనికి కారణం కావొచ్చని భావిస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని