ఆసుపత్రి స్థాయిలోనే కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో వైద్య సేవలు
close
Published : 14/05/2020 20:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆసుపత్రి స్థాయిలోనే కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో వైద్య సేవలు

పద్మావతి నిలయం కొవిడ్‌ కేర్‌ సెంటర్‌, వైద్య విభాగం ఇన్‌ఛార్జీలతో ముఖాముఖి.. 

తిరుపతి : రోజురోజుకూ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కొవిడ్ కేర్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటి వరకు కరోనా అనుమానితులు బస చేసేందుకు వినియోగించిన క్వారంటైన్‌ కేంద్రాలను కొవిడ్‌ కేర్‌ సెంటర్స్‌గా మారుస్తున్నారు. దీనిలో భాగంగా చిత్తూరు జిల్లాలోని పద్మావతి నిలయాన్ని కొవిడ్‌ కేర్‌ కేంద్రంగా మార్చారు. 400 మందికి వైద్య సేవలు అందించేందుకు వీలుగా ఇక్కడ మౌలిక వసతులు కల్పించారు. క్వారంటైన్‌ కేంద్రాలు కొవిడ్‌ కేర్‌ సెంటర్లుగా మారిన విధానంపై కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఇన్‌ఛార్జి లక్ష్మి, వైద్య విభాగం ఇన్‌ఛార్జి శ్రీనివాసరావుతో ఈటీవీ ముఖాముఖి.. 

గతంలోని క్వారంటైన్‌ కేంద్రం ప్రస్తుతం కొవిడ్‌ కేర్‌ సెంటర్‌గా మారింది. ఈ రెండింటి మధ్య వ్యత్యాసాలేంటి? 

మార్చి 23 నుంచి పద్మావతి నిలయం క్వారంటైన్‌ కేంద్రం ద్వారా వైద్య సేవలందించి వారిని ఆరోగ్యంగా ఇంటికి పంపించడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్‌ ఈ పద్మావతి నిలయాన్ని కొవిడ్‌ కేర్‌ సెంటర్‌గా మార్చారు. కరోనా బారిన పడి ఆసుపత్రికి వెళ్లి తరువుగా పరీక్షించిన తరువాత వారికి ఎలాంటి ఇబ్బంది లేదు, ఆరోగ్యవంతంగా ఉన్నారు అని తేలాక వారిని ఇక్కడికి పంపిస్తారు. వీరిని ఉదయం, సాయంత్రం వైద్యులు పరీక్షించి మెడికేషన్‌ ఇస్తారు. ఆరోగ్యకర ఆహారం అందిస్తారు. ఇక్కడ ఆహ్లాదకర వాతావరణంలో వైద్యం అందివ్వడంతో త్వరగా కొలుకునే అవకాశం ఉంది.  

ప్రస్తుతం ఇక్కడ ఎంత మంది ఉన్నారు. ఇప్పటి వరకు ఎంత మందికి సేవలు అందించారు? 

ఇప్పటి వరకు ఇక్కడ 1002 మందికి  వైద్య సేవలందించాం. నిన్నటి నుంచి ఇక్కడ పూర్తి స్థాయి సేవలు ప్రారంభించాం. ప్రస్తుతం నలుగురు ఉన్నారు. ఇంకా కొంతమందిని పంపిస్తున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న లక్షణాల ఆధారంగా ఇక్కడికి పంపిస్తారు. 

ఆసుపత్రి నుంచి రోగులను ఇక్కడికి తీసుకువస్తున్నారు. ఆసుపత్రి స్థాయిలోనే ఇక్కడ వైద్య సేవలు అందుతున్నాయా..? 

ఆసుపత్రి స్థాయిలోనే ఇక్కడా పూర్తి స్థాయిలో సేవలు పక్కాగా అందిస్తున్నారు. పాజిటివ్‌ అని తేలిన వెంటనే సంబంధిత పీహెచ్‌సీ, పట్టణాల నుంచి గంట వ్యవధిలోనే ఆసుపత్రికి తరలిస్తున్నారు. అక్కడ పూర్తి రక్త పరీక్షలు చేసి, ఎక్స్‌రే, ఈసీజీ తీసి వారికి హైడ్రాక్సి క్లోరోక్విన్‌ని ప్రారంభించిన తరువాత ఇక్కడికి పంపిస్తున్నారు.  

 

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని