సమీకృతం.. అగమ్యగోచరం
close
Published : 30/07/2021 04:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సమీకృతం.. అగమ్యగోచరం

● ఆరంభం కాని మార్కెట్ల పనులు

● రోడ్లపైనే కూరగాయలు, పండ్లు, మాంసం విక్రయాలు

నేరేడుచర్ల, న్యూస్‌టుడే

నేరేడుచర్లలో రోడ్లపైనే కూరగాయలు, పండ్ల విక్రయాలు

ఉమ్మడి జిల్లాలోని దాదాపు అన్ని పురపాలికల్లో సమీకృత మార్కెట్ల నిర్మాణానికి స్థలాలు, నిధులు అందుబాటులో ఉన్నప్పటికి పనులు ఇంత వరకు ప్రారంభం కాలేదు. చాలా చోట్ల టెండర్ల ప్రక్రియ పూర్తయింది. వీటి నిర్మాణానికి సూర్యాపేట జిల్లాలో ఐదు పురపాలికల్లో రూ.19.60 కోట్లు, నల్గొండలో ఏడు పురపాలికల్లో రూ. 20.10 కోట్లు, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆరు పురపాలికల్లో రూ. 17.20 కోట్లు వెచ్చిస్తున్నారు. పాత పురపాలికల్లో కొంత పరిస్థితి మెరుగ్గా ఉండగా కొత్త పురపాలికల్లో చాలా భాగం కూరగాయలు, పండ్లు, మాంసం విక్రయాలు రహదారులపైనే జరుగుతుండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. మూలమలుపుల్లోనూ చిరువ్యాపారులు విక్రయాలు సాగిస్తుండడంతో కొన్నిసార్లు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మాంసం విక్రయాలు రోడ్లపై జరపడం వల్ల దుమ్ము, ధూళి వంటి వాటితో పాటు, ఆయా ప్రాంతాల్లో అపరిశుభ్రతకు ఆస్కారం ఏర్పడుతోంది. ఈ సమస్యలన్నింటికి పరిష్కారం లభించాలంటే సత్వరం సమీకృత మార్కెట్ల పనులు గుత్తేదారులు ప్రారంభించేలా అధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరముంది.

పనులు చేపట్టేదెప్పుడో..?

నేరేడుచర్ల, ఆలేరు, నల్గొండ, దేవరకొండ, యాదగిరిగుట్ట పురపాలికల్లో టెండర్లు పూర్తయినా పనులు మొదలు కాలేదు. మోత్కూరులో పనులు శంకుస్థాపనకే పరిమితమయ్యాయి. చౌటుప్పల్‌, చండూరులలో, హుజూర్‌నగర్‌లలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. సూర్యాపేట, నందికొండ, హాలియా, కోదాడ, తిరుమలగిరి పురపాలికల్లో ఇంకా పనులు ప్రారంభం కాలేదు. భువనగిరిలో పనులు జరుగుతున్నాయి. పోచంపల్లిలో స్థలం, నిధులు కేటాయించలేదు.

● నేరేడుచర్ల పురపాలికలో అందరికి అందుబాటులో ఉండే స్థలాన్ని ఎంపిక చేశారు. ఇక్కడ సమీకృత మార్కెట్‌ ఏర్పాటుకు ఎన్‌ఎస్‌పీ క్యాంపులో ఖాళీగా ఉన్న స్థలాన్ని కలెక్టర్‌ పరిశీలించి ఎంపిక చేశారు. రెవెన్యూ అధికారులు స్థల సర్వే పూర్తి చేశారు. ప్రభుత్వం రూ.2.40 కోట్లు కేటాయించడంతో టెండర్‌ ప్రక్రియ పూర్తి చేశారు. ఎన్‌ఎస్‌పీ వారు పురపాలికకు స్థలం అప్పగించడమే తరువాయి. ఈప్రక్రియ పూర్తయితే పనులు చేపట్టడానికి వీలవుతుంది. మిర్యాలగూడలో సాగర్‌ రోడ్డులో ఫ్లైఓవర్‌ కింద కూరగాయల విక్రయాలు జరుగుతున్నాయి.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని