ఇమ్యూనిటీని పెంచే పోషకా(పా)లు
close
Updated : 29/04/2021 02:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇమ్యూనిటీని పెంచే పోషకా(పా)లు

కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. మాస్కు ధరించడం, సామాజిక దూరం పాటించడం, తరచూ చేతులు కడుక్కోవడం ప్రస్తుతం మనం తప్పనిసరిగా చేయాల్సిన పనులు. వీటితోపాటు రోగనిరోధకతను పెంచుకోవాల్సిన అవసరమూ ఉంది. అందుకోసం ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. రోజూ పాలు తాగుతాం కదా... వీటిలో కొన్ని పదార్థాలను చేర్చుకోవడం ద్వారా ఇమ్యూనిటీని పెంపొందించుకోవచ్చు.

పసుపు పాలు... పసుపులో యాంటీవైరస్‌, యాంటీక్యాన్సర్‌, యాంటీబ్యాక్టీరియల్‌, యాంటీఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనాలు మెండుగా ఉంటాయి. కాబట్టి రోజూ గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు వేసుకుని తాగండి. ఇలా క్రమం తప్పక చేస్తే రోగనిరోధకత పెరుగుతుంది.

ఎండు ఖర్జూరాలు (డేట్స్‌).. వీటిలో విటమిన్లు, పీచు, ఐరన్‌, క్యాల్షియంలతో పాటు యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. వీటిని పాలలో వేసి మరిగించి రోజూ రాత్రి పడుకోబోయే ముందు తీసుకుంటే పోషకాలన్నీ సొంతమవుతాయి. దీంతో నిరోధక శక్తి పెరుగుతుంది.

డ్రైఫ్రూట్స్‌... వీటిలో యాంటీఆక్సిడెంట్‌ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. అలాగే కాలానుగుణంగా వచ్చే వ్యాధుల నుంచి రక్షిస్తాయి. వీటిని తినడం వల్ల మధుమేహం, రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అయితే వీటిని పొడి చేసుకుని గోరువెచ్చని పాలలో కలిపి తీసుకుంటే లభించే పోషకాలు రెట్టింపు అవుతాయి.

గింజలు.. పొద్దుతిరుగుడు, గుమ్మడి, చియా, అవిసె గింజలను చక్కగా పొడి చేసుకుని నిల్వ చేసుకోవాలి. ఈ పొడి వేడి పాలతో కలిపి తీసుకుంటే ఆరోగ్యం మీ వెంటే.

అల్లం పాలు.. దీంట్లో విటమిన్లు, ఐరన్‌, క్యాల్షియం ఉంటాయి. అంతేనా... యాంటీఆక్సిడెంట్స్‌, యాంటీవైరల్‌ సుగుణాలు అధికమే. కాబట్టి అల్లం రసాన్ని పాలలో వేసుకుని తాగితే రోగాలు దరికి రావు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని