కాంతినిచ్చే చామంతి టీ!
close
Published : 23/06/2021 01:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కాంతినిచ్చే చామంతి టీ!

ఇప్పుడు కాలంతో సంబంధం లేకుండా అన్ని పూలూ దొరుకుతున్నాయి. అలానే ప్రత్యేక పద్ధతుల్లో ఎండబెట్టిన రకాలూ అందుబాటులో ఉంటున్నాయి. అలాంటివాటిల్లో చామంతి కూడా ఒకటి. దీన్ని సౌందర్య పోషణకూ ఉపయోగించొచ్చు.
చామంతిరేకల్ని శుభ్రంగా కడిగి వేడినీళ్లల్లో మరిగించి దానికి కాస్త తేనె కలిపి ముఖానికి పూతలా రాయండి. ఇలా తరచూ చేయడం వల్ల ముఖంపై ఉన్న మచ్చలు తొలగిపోయి ముఖం కాంతిమంతంగా మారుతుంది. చర్మం తాజాగానూ కనిపిస్తుంది.
* చామంతి టీ నీళ్లలో కాస్త గులాబీనీరు, నిమ్మరసం చేర్చి ముఖం కడుక్కోండి. ఇది చర్మంపై ఉన్న టాన్‌ని తొలగిస్తుంది. కాంతిమంతంగా కనిపించేలా చేస్తుంది.
* ముఖంపై మొటిమలు ఇబ్బంది పెడుతుంటే కప్పు నీళ్లలో కొన్ని చామంతులు, నాలుగు తులసి ఆకులు వేసి మరగనివ్వండి. ఈ మిశ్రమం చల్లారాక కాస్త ఉలవపిండి, చెంచా తేనె కలిపి ముఖానికి ప్యాక్‌లా వేస్తే సరి. మృతకణాలు తొలగుతాయి. మీ సమస్య దూరమవుతుంది.

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని