వాళ్లు నిలబడ్డారు.. వీళ్లు గోల్స్‌ కొట్టారు - german football team humiliating defeat
close
Published : 01/10/2020 01:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వాళ్లు నిలబడ్డారు.. వీళ్లు గోల్స్‌ కొట్టారు

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా కారణంగా క్రీడల నిర్వహణ కష్టతరంగా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా నిబంధనలను పాటిస్తూ కొన్ని క్రీడలు కొనసాగుతున్నాయి. అయినా ఆటగాళ్లు కరోనా విషయంలో భయపడుతూనే ఉన్నారు. ఇటీవల ఓ ఫుట్‌బాల్‌ జట్టు ప్రత్యర్థి జట్టుకు కరోనా ఉందోమోనని ఆట సరిగా ఆడకపోవడంతో ఘోర పరాజయం మూటగట్టుకోవాల్సి వచ్చింది.

జర్మనీలో స్థానిక ఫుట్‌బాల్‌ జట్లతో లోయర్‌ లీగ్‌ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌ 13న సీజీ రిప్‌డార్ఫ్‌ జట్టు.. ఎస్వీ హెల్డెన్‌స్టెడ్‌తో తలపడింది. అయితే అంతకుముందు ఎస్వీ హెల్డెన్‌స్టెడ్‌ జట్టుతో ఒక మ్యాచ్‌ ఆడిన ఓ జట్టులో ఆటగాళ్లకు కరోనా సోకిందని తెలియడంతో.. అది హెల్డెన్‌స్టెడ్‌ జట్టుకు వ్యాప్తి చెంది ఉంటుందని రిప్‌డార్ఫ్‌జట్టు ఆటగాళ్లు అనుమానపడ్డారు. వారికి పరీక్షలు నిర్వహించగా కరోనా నెగటివ్‌ వచ్చింది. అయినా హెల్డెన్‌స్టెడ్‌ జట్టుతో మ్యాచ్‌ ఆడేందుకు విముఖత వ్యక్తం చేశారు. మ్యాచ్‌ను వాయిదా వేయాలని కోరారు. 

అయితే నిర్వాహకులు మాత్రం వాయిదా వేయడం కుదరదంటూ ఇరు జట్ల మధ్య మ్యాచ్‌ను నిర్వహించారు. అయితే, రిప్‌డార్ఫ్‌ జట్టులో కొంతమంది ఫుట్‌బాల్‌ కోర్టులో అడుగుపెట్టడానికి కూడా ఇష్టకపడకపోవడంతో క్రీడా నిబంధనల ప్రకారం కనీసం ఏడుగురు ఆటగాళ్లతో మ్యాచ్‌ నిర్వహణకు సిద్ధమయ్యారు. ఈ మ్యాచ్‌లో రిప్‌డార్ఫ్‌ ఆటగాళ్లు బాల్‌ను ప్రత్యర్థికి ఇచ్చి, సామాజిక దూరం పాటిస్తూ నిల్చుండిపోయారు. దీంతో హొల్డెన్‌స్టెడ్‌ జట్టు ప్రత్యర్థుల ప్రతికూల పరిస్థితులను అవకాశంగా మలుచుకొని గోల్స్‌ మీద గోల్స్‌ చేసింది. ఆటముగిసే సమయానికి హోల్డెన్‌స్టెడ్‌ 37 గోల్స్‌ కొట్టింది. రిప్‌డార్ఫ్‌ ఒక్క గోల్‌ కూడా చేయకుండా 0-37తేడాతో ఓడిపోయింది. కావాలనే ఆట సరిగా ఆడనందుకు రిప్‌డార్ఫ్‌ జట్టు కెప్టెన్‌పై రిఫరీ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. తమ జట్టు కరోనా కోరల్లో చిక్కుకోకూడదనే ఇలా వ్యవహరించిందని ఆ జట్టు యాజమాన్యం వెల్లడించింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని