ఈ దేశాల్లో సెప్టెంబరు నుంచి బూస్టర్‌ డోస్‌ - germany france ignore who request will give covid booster shots
close
Published : 06/08/2021 01:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ దేశాల్లో సెప్టెంబరు నుంచి బూస్టర్‌ డోస్‌

డబ్ల్యూహెచ్‌వో ఆదేశాలు బేఖాతరు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమ పౌరులకు సెప్టెంబరు నుంచి కొవిడ్‌ వ్యాక్సిన్‌ బూస్టర్‌ డోస్‌(మూడో విడత టీకా) ఇచ్చేందుకు ఫ్రాన్‌, జర్మనీ సిద్ధమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా మరింతమందికి వ్యాక్సిన్‌ దక్కేవరకు ఈ ప్రక్రియ వాయిదా వేయాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) సూచనలను బేఖాతరు చేస్తూ.. ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ‘మూడో విడత టీకా అవసరం కావచ్చు. వృద్ధృలకు, వైరస్‌ సోకే అవకాశం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తామ’ని  ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మేక్రాన్‌ ఇన్‌స్టాగ్రాం వేదికన తెలిపారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి, వయోవృద్ధులకు, ఆసుపత్రుల్లో ఉండేవారికి టీకా అందించాలని భావిస్తున్నట్లు జర్మనీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 

అర్థం చేసుకున్నా.. కానీ, ఇది ఆమోదయోగ్యం కాదు 

బూస్టర్‌ డోస్‌ విషయమై డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ బుధవారం కీలక ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. ‘సెప్టెంబరు చివరి వరకు  ఈ ప్రక్రియ నిలపాలి. డెల్టా వేరియంట్ బారినుంచి ప్రజలను కాపాడేందుకు  ప్రభుత్వాలు పడుతున్న ఆందోళనను నేను అర్థం చేసుకున్నా. కానీ..  కొన్ని దేశాలు ఇప్పటికే పెద్దఎత్తున వ్యాక్సిన్లు వినియోగించాయి. ఇప్పుడు మరిన్ని వినియోగించడం ఆమోదయోగ్యం కాద’ని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు జర్మనీ ఈ వ్యాఖ్యలను ఖండించింది. తామూ పేద దేశాలకు 30 మిలియన్ల టీకాలను విరాళంగా సరఫరా చేస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు ఫ్రాన్స్‌.. నాలుగో వేవ్‌ను ఎదుర్కొనేందుకు, కొవిడ్‌ కట్టడి విషయంలో ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజలనుంచి వస్తున్న వ్యతిరేకతను తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని