Varalakshmi: వ్యాక్సినేషన్‌పై నటి స్పెషల్‌ వీడియో - getvaccinated avoid rumours says varalakshmi
close
Published : 04/06/2021 17:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Varalakshmi: వ్యాక్సినేషన్‌పై నటి స్పెషల్‌ వీడియో

చెన్నై: కరోనా నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని ప్రభుత్వం, అధికారులు ఎన్నోరోజుల నుంచి విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ.. ఇంకా కొంతమంది మాత్రం ఆసక్తి కనబర్చడం లేదు. వ్యాక్సిన్‌ వల్ల ఏమైనా అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చేమోననే అనుమానంతో పలువురు వ్యాక్సిన్‌ తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. ఈ క్రమంలోనే నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ వ్యాక్సినేషన్‌ గురించి అవగాహన కల్పిస్తూ ఓ స్పెషల్‌ వీడియోని షేర్‌ చేశారు. అనవసరమైన విషయాల గురించి ఆలోచించి వ్యాక్సిన్‌ వేయించుకోకుండా ఉండొద్దని ఆమె తెలిపారు.

‘వ్యాక్సిన్‌ వేయించుకోవడానికి భయపడొద్దు. ఉదాహరణకు బైక్‌పై వెళ్లేవారు ఊహించని ప్రమాదాన్ని ఆపలేరు. హెల్మెట్‌ ధరించినట్లయితే ప్రాణాలను కాపాడుకోవచ్చు. వ్యాక్సిన్‌ కూడా అంతే. వ్యాక్సిన్‌ వేసుకున్నంత మాత్రాన కరోనా రాదని కాదు. వ్యాక్సిన్‌ వేయించుకున్నట్లయితే కరోనా తీవ్రత మనపై తక్కువగా ఉంటుంది. ప్రాణాలకు హాని ఉండదు. అలాగే వ్యాక్సిన్‌ వేయించుకున్న అందరికీ అనారోగ్య సమస్యలు రావు. ఒకవేళ వచ్చినా కూడా అవి సాధారణంగానే ఉంటాయి. కాబట్టి వ్యాక్సిన్‌ వేయించుకుందాం...కరోనాను తరిమేద్దాం’ అని ఆమె అన్నారు.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని