ఇంటర్నెట్ డెస్క్: ‘డాన్‌శీను’తో డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి.. ‘బాడీగార్డ్’తో తనలోని కెప్టెన్‌కున్న సత్తా చూపించాడు. ఆ తర్వాత ‘బలుపు’.. ‘పండగ చేస్కో’.. ‘విన్నర్’ సినిమాలు చేసినా.. తన స్థాయికి తగ్గ విజయం దక్కలేదు. అందుకే ముచ్చటగా మూడోసారి మాస్‌మహారాజ్ రవితేజతో కలిసి ‘క్రాక్’ను తెరకెక్కించారు. దీంతో బ్లాక్‌బ్లస్టర్ విజయం సాధించారు డైరెక్టర్ గోపీచంద్ మలినేని. ఈ సినిమా మంచి విజయం సాధించిన సందర్భంగా తాజాగా మీడియాతో మాట్లాడారు. అందులో భాగంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ఆ ఇబ్బంది ఏ డైరెక్టర్‌కూ రాకూడదు..
సినిమా హిట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. కరోనా తర్వాత మార్చి నుంచి అక్టోబర్ వరకూ నేను పడిన కష్టాలు చెప్పలేనివి. సినిమాను ఓటీటీకి తీసుకువెళ్లాలని తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. అన్నింటికీ చెక్ పెట్టాలని ఒకసారి ‘క్రాక్ ఇన్ థియేటర్స్’ అని ట్వీట్ చేశాను. అంతమొండితనంగా వ్యవహరించాల్సి వచ్చింది. ఎందుకంటే మనది మాస్సినిమా. థియేటర్లోనే చూడాల్సిన సినిమా. థియేటర్లో కేరింతల మధ్య చూస్తే ఆ మజా వేరు. అదే నమ్మాను నేను. జనవరి 9న విడుదల చేద్దామనుకున్న నాకు పెద్ద షాక్. నాకు వచ్చిన ఆ ఇబ్బంది ఏ డైరెక్టర్‌కు కూడా జీవితంలో రాకూడదు. ఉదయం 8.45కి షో పడలేదు.. 11గంటలకు పడలేదు.. మాట్నీ కూడా పడలేదు. ఫస్ట్‌షో కూడా పడలేదు. ఆ టైమ్‌లో చాలా ఇబ్బంది అనిపించింది. దాన్ని మాటల్లో చెప్పలేను. సెకండ్ షో పడింది. అప్పటికీ జనం బాగా ఉంటారని ఊహించలేదు. 50శాతం నిబంధనతో రవితేజగారి కెరీర్లోనే పెద్ద హిట్ అంటే మామూలు విషయం కాదు.
నాకు అసలు నిద్ర కూడా లేదు.
సినిమా విడుదల ఆగిపోవడానికి కారణం ఏంటో ముందు రోజు(8న) సాయంత్రం తెలిసింది. అది సద్దుమణుగుతుందేమో అనుకున్నాం. కానీ అలా కాలేదు. ఆ సమయంలో తిరుపతి ప్రసాద్‌గారు.. ఎన్వీ ప్రసాద్‌గారు.. హారికాహాసిని వంశీ, దాము గారు నాకు అండగా ఉన్నారు. అందరూ ఒక మంచి సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. సినిమాలో దమ్ములేకపోతే ఆదరించరు. సినిమా తర్వాత నాకు ఇండస్ట్రీలో ఉన్న అందరు డైరెక్టర్లు ఫోన్ చేశారు. సినిమాలో అన్ని పాత్రలు బాగున్నాయని రామ్‌చరణ్ అన్నారు. ఒక డైరెక్టర్‌గా ఈ సినిమాకు నాకు ఎంతో ధైర్యాన్ని, నమ్మకాన్ని ఇచ్చింది.
అది చాలా గొప్పవిషయం..
మా సినిమా విడుదల ఆగినప్పుడు అందరు అలా ఒక్కటిగా మారి మాకోసం నిలబడటం గొప్ప విషయం. మూడు షోలు పడని సమయంలో ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది ఫోన్ చేసి నాకు ధైర్యమిచ్చారు. మంచు మనోజ్గారు ప్రత్యేకంగా ఫోన్ చేసి బ్రదర్ నువ్వు హిట్టు కొడుతున్నావ్.. టెన్షన్ పడకు అన్నారు. సాయితేజ్ కూడా ఫోన్ చేసి అన్నా నువ్వు మంచి సినిమా తీశావ్ అన్నారు. అయితే.. వాళ్లకు తెలుసు ఇది మంచి సినిమా అని, ఖచ్చితంగా ఆడుతుందని నమ్మారు. కానీ మొదటిరోజు మూడు షోలు మిస్ అవడంవల్ల చాలా ఆదాయం కోల్పోయాం. అయినా.. ఇప్పటికీ థియేటర్లు హౌస్‌ఫుల్ అవుతున్నాయి. ఇది చాలు.
అదే సినిమాకు బలం..
విడుదల ఆగినప్పుడు నా మానసిక స్థితి ఎలా ఉందంటే.. థియేటర్ల దగ్గర ఎంత మంది జనం ఉన్నారనే విషయం నేను చూడలేదు. ఎలాగైనా షో వేయాలన్నదే నా ఆలోచన. ఉదయం కాకపోతే మధ్యాహ్నం 2గంటలకు విడుదల చేద్దాం అనుకున్నా. సాయంత్రం వరకూ నాకీ విషయం తెలియలేదు. ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించడానికి కారణం కథ. సినిమాలో వేటపాలెం.. జయమ్మ.. కటారి కృష్ణ.. వీటి గురించే అందరూ మాట్లాడుతున్నారు. కొత్తదనం స్క్రీన్‌మీదకు తీసుకురావడంతో ప్రేక్షకులు బాగా మెచ్చారు.
‘అంకడు’ పాత్రకు అనుకోకుండా తీసుకున్నా..
డాన్‌శీను, బలుపు సినిమాకు స్టంట్ శివ ఫైట్ మాస్టర్‌గా పనిచేశారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో ఆయన వచ్చి పొజీషన్లో నిల్చునే తీరు చూసినప్పుడు ఆయనలో ఆర్టిస్ట్ కనిపించేవారు. అందుకే అనుకోకుండా ఆయనను సినిమాలో తీసుకున్నాను. ఆయన అల్లుడు అదుర్స్ సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు ఒకసారి ఫోన్ చేసి సెట్‌కు రమ్మంటే గంటలో వచ్చాడు. ఇప్పుడు ‘అంకడు’ను పరిచయం చేసే సీన్ అని చెప్పగానే.. ఇంతకీ అంకడంటే ఎవరని ఆయన అన్నారు. పదిహేను నిమిషాలు ఆయనకు కథ వివరించిన తర్వాత మరి నేను చేస్తానా..? అన్నారు. అలా ఆయనతో ఒప్పించాను. ఆయన ఆ పాత్ర చాలా బాగా చేశారు. ఫైట్ మాస్టర్ కావడంతో సన్నివేశాలు బాగా వచ్చాయి.
అన్ని రకాల సినిమాలు తీస్తా..
మైత్రీ మూవీస్‌లో ఒక సినిమా చేస్తున్నాను. లాక్డౌన్లో ఒక మంచి కథ తీసుకున్నాం. ఒకవారం రోజుల్లో మొత్తం వివరాలు ప్రకటిస్తాం. భిన్నమైన సినిమాలు తీయాలనుకుంటున్నాను. క్రాక్ తీసేసమయంలోనే కొన్ని కథలు రాసుకున్నాను. అవి పూర్తి భిన్నంగా ఉంటాయి. అవన్నీ ఎంతో కసితో రాశాను. నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని రాసుకున్న కథలు అవి.
క్రాక్2 గురించి చాలా మంది అడుగుతున్నారు..
క్రాక్2 గురించి చాలామంది అడుగుతున్నారు. బాలీవుడ్లో సరైన హీరో.. నిర్మాత.. దొరికితే ఖచ్చితంగా నేనే చేస్తా. రణ్‌వీర్‌సింగ్, అక్షయ్‌కుమార్, అజయ్ దేవ్గన్ బాగా సెట్ అవుతారు.
ఆయన కథ చెప్పగానే ఆశ్చర్యానికి గురయ్యారు..
ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ హీరోను ఎలివేట్ చేస్తూ ఉంటుంది. అది బాగా వచ్చింది. పాత్రకు ఆయన మాత్రమే న్యాయం చేయగలరని నాకు అనిపించింది. ఆయనకు కథ చెప్పగానే ఒక్కక్షణం ఆశ్చర్యానికి గురయ్యారు.
ఇదీ చదవండి..
అభిమానులకు ‘ఆర్ఆర్ఆర్’ బ్రేకింగ్ న్యూస్
మరిన్ని
కొత్త సినిమాలు
- నిర్మాతలే అసలైన హీరోలు: రామ్ పోతినేని
- ‘హిట్ 2’ ఖరారు.. కేడీ ఎవరు?
-
‘వై’ పోస్టర్ విడుదల!
- అతన్ని చంపబోయాను..అనిల్‌కపూర్
- దేవరకొండవారి ‘పుష్పక విమానం’!
గుసగుసలు
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
-
విజయ్ దేవరకొండ సరసన రష్మిక?
- మూడో చిత్రం ఖరారైందా?
- దిశను ఓకే చేశారా?
- క్రిష్-వైష్ణవ్ మూవీ.. టైటిల్ అదేనా?
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుంది: నితిన్
-
సాయిపల్లవిలాంటి డ్యాన్సర్లుంటే మాస్టర్లకు పండగే
- హీరో కావడం... మాటలు కాదు!
- ప్రేమ సినిమా... ఏది కావాలో తేల్చుకో... అంది!
-
రొటీన్ పాత్రలు చేసి బోర్ కొట్టింది: లావణ్య
కొత్త పాట గురూ
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’
-
‘మనసంతా చేరి మార్చావే దారి’ అంటోన్న సుమంత్
-
‘పైన పటారం..’ అంటున్న అనసూయ
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
మాస్ స్టెప్లతో అదరగొట్టిన అనసూయ