పొడుపు కథలు - haibujji
close
Published : 11/08/2020 00:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పొడుపు కథలు

1. అక్కా చెల్లెల అనుబంధం, ఇరుగూ పొరుగూ సంబంధం, దగ్గర దగ్గర ఉన్నారు. అయినా కలవలేకపోతున్నారు.

2. ఇంతింత గుడికాదు.. ఈశ్వరుని గుడికాదు.. కంచుగోపురం కాదు..కదలదు, మెదలదు?


తమాషా ప్రశ్నలు

యుద్ధంలో ముందుకే వెళ్తాం. రాజుకు ఆపద ఉన్నా సరే మేము వెనక్కి రాము. మేమెవరం?

తలకాయ లేదు. కానీ టోపీ పెట్టుకుంటుంది. ఏమిటి?

100 కన్నా 99 ఎప్పుడు పెద్దది అవుతుంది?


నేనెవర్ని ?

అమ్మ కడుపున పడ్డాను. సుఖంగా ఉన్నాను. నీచేతి దెబ్బలు తిన్నాను.

నిలువునా ఎండిపోయాను. నిప్పుల గుండం తొక్కాను.

గుప్పెడు బూడిద అయ్యాను. నేనెవర్ని?


చిన్నూ కబుర్లు

1. కప్పలు చర్మంతో నీటిని తాగుతాయి.

2. కోతులకు కూడా మనలాగే వయసు పెరిగే కొద్దీ బట్టతల వస్తుంది.

3. ఆవులు, గుర్రాలు నిలబడే నిద్రపోతాయి.


క్విజ్‌ క్విజ్‌

1. ప్రపంచంలో అతి పెద్ద దేశం ఏది?

2. అరుణ గ్రహం అని ఏ గ్రహాన్ని పిలుస్తారు?

3. మొక్కలమీద పరిశోధనలు చేసే శాస్త్రాన్ని ఏమంటారు?

4. అంతర్జాతీయ క్రికెట్‌ను అత్యంత పిన్న వయసులో ఆడిన ఆటగాడెవరు?

5. సీతాకోక చిలుకకి ఎన్ని కాళ్లుంటాయి?


అవునా? కాదా?

1. మానవుని మెదడు బరువు 1350 గ్రాములు.

2. ప్లేగు వ్యాధి ఎలుకల నుంచి మనుషులకు వ్యాపించేది.

3. నైరుతి రుతుపవనాలు మన దేశంలో ముందుగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశిస్తాయి.


సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3X3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండు సార్లు రాకూడదు.


దారేది?


గబగబా అనండి

Nick kicked a slick brick at Rick, but the slick brick hit Nick


జవాబులు

పొడుపు కథలు: 1. కళ్లు 2. ఆకాశం

క్విజ్‌: 1.రష్యా, 2.అంగారక గ్రహం 3.బోటనీ, 4.హాసన్‌ రజా, 5.ఆరు

నేనెవర్ని: 1.పిడక

తమాషా ప్రశ్నలు: 1. చదరంగంలో బంట్లు 2. వాటర్‌ బాటిల్‌ 3. తెలుగులో రాసినప్పుడు

అవునా? కాదా?: 1. అవును 2. అవును 3. కాదు.. కేరళలో ప్రవేశిస్తాయి.

కవలలేవి?: 1,2 (కాళ్లు)మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని