నటుడు‌ సూర్యకు కరోనా - hero surya tested positive for corona
close
Updated : 08/02/2021 10:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నటుడు‌ సూర్యకు కరోనా

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ కథానాయకుడు సూర్య కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘నేను కరోనాతో బాధపడుతున్నాను. ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నాను. మన జీవితాలు కరోనా నుంచి ఇంకా బయటపడలేదు. అలాగని భయపడవద్దు. కరోనా సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా నుంచి కోలుకోవడానికి కృషి చేస్తున్న వైద్య సిబ్బందికి ధన్యవాదాలు’’ అని సూర్య పేర్కొన్నారు.   

సూర్య త్వరతిగతిన కరోనా నుంచి కోలుకోవాలని పలువురు సినీ ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ సూర్యకు పెద్ద ఎత్తున అభిమానులున్నారు. ఇటీవల ఆయన నటించిన ‘ఆకాశం నీ హద్దురా!’ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఎయిర్‌డెక్కన్‌ వ్యవస్థాపకుడు జీ.ఆర్‌. గోపీనాథ్‌ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. 

ఇదీ చదవండి..
వారంతా క్షేమంగా బయటపడాలి: మహేష్‌బాబుమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని