పెట్రోల్‌, విద్యుత్‌తో నడిచే బైక్‌! - hybrid motor cycle that runs with petrol electricity made by gujarats vvp engineering students
close
Published : 21/07/2021 21:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పెట్రోల్‌, విద్యుత్‌తో నడిచే బైక్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: పెట్రోల్‌ ధరలు అమాంతంగా పెరిగిపోవడంతో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ప్రస్తుతం అందరూ విద్యుత్‌తో నడిచే వాహనాలు వైపు మొగ్గు చూపుతుండగా.. గుజరాత్‌కు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థులు పెట్రోల్‌, విద్యుత్‌తో నడిచే బైక్‌ను తయారు చేసి అందరి దృష్టినీ ఆకర్షించారు. రాజ్‌కోట్‌లోని వీవీపీ ఇంజనీరింగ్‌ కళాశాల చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థులు పెట్రోల్‌ అయిపోయినా బ్యాటరీ సాయంతో దూసుకుపోయే హైబ్రిడ్‌ బైక్‌ తయారు చేశారు. ఈ బైక్‌లో నాలుగు వేర్వేరు బ్యాటరీలు అమర్చారు. ఒక బ్యాటరీ ఛార్జ్‌ అవ్వడానికి ఆరు గంటల సమయం పట్టగా.. పూర్తి ఛార్జింగ్‌ ఉన్న బ్యాటరీ సాయంతో ఏకధాటిగా 40 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో షికారు చేయొచ్చు. హ్యండిల్‌కి ఏర్పాటు చేసిన స్విచ్‌ సాయంతో పెట్రల్‌ నుంచి విద్యుత్‌కి లేదా విద్యుత్‌ నుంచి పెట్రోల్‌కు మారొచ్చు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని