ఆమెను చూసే పోల్‌డ్యాన్స్ నేర్చుకుంటున్నా: పాయల్‌  - i was inspired by jessica alba and cameron diaz payal ghosh
close
Published : 09/06/2021 19:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆమెను చూసే పోల్‌డ్యాన్స్ నేర్చుకుంటున్నా: పాయల్‌ 

ఇంటర్నెట్‌ డెస్క్: తెలుగులో ‘ప్రయాణం’ చిత్రంతో ఆకట్టుకున్న భామ పాయల్‌ ఘోష్‌. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో ‘ఊసరవెల్లి’లో నటించి మెప్పించింది. తాజాగా ఈ అందాల భామ పోల్‌డ్యాన్స్ గురించి మాట్లాడుతూ..‘‘అసలు ఈ డ్యాన్స్ నేర్చుకోవడానికి కారణం ఏమిటంటే ప్రస్తుతం నేను ‘న్యూయార్క్ టు హరిద్వార్’ అనే చిత్రంలో నటిస్తున్నాను. ఇందులో నేను పోల్‌డ్యాన్స్‌ చేయాల్సిన సాంగ్‌ ఒకటి ఉంది. ఏదో ఊరికే కెమెరా ముందు ఫోజులు పెట్టి ఫ్రంట్ షాట్స్ తీసినా బాగానే వస్తాయి. కానీ నా మనసు కోరుకున్నట్లు బాగా రావడం కోసం హాలీవుడ్‌ నటి జెన్నిఫర్ లోఫెజ్‌ నటించిన ‘హస్ట్లర్స్’ (2019) చూశాను. ఇంకా ‘చార్లీ ఏంజిల్స్’, ‘ఫెంటాస్టిక్ ఫోర్’ వంటి చిత్రాలను కూడా చూశా. కామెరాన్ దియాజ్, జెస్సికా అల్బాల స్టంట్స్ నుంచి కూడా ఎంతో ప్రేరణ పొందాను. వారి గురించి అనేక ఇంటర్వ్యూలను చదివా. వీరంతా మార్షల్ ఆర్ట్స్, తైక్వాండో నేర్చుకున్నారని అర్థం చేసుకున్నాను. మార్షల్‌ ఆర్ట్స్ వల్ల చేతులు, కాళ్లు కదలికలు చాలా ఈజీగా ఉంటాయి. ఇలాంటివి అంటే నాకెంతో ఇష్టం, ప్రేమ. ముందు మనం కొవిడ్‌ మహమ్మారిని నివారిద్దాం. నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా, సురక్షితంగా ఉండండి’’ అంటూ తెలిపింది.  
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని