కోహ్లీసేనకు జరిమానా వేసిన జవగళ్‌ శ్రీనాథ్‌ - india fined for slow-over rate in second t20
close
Published : 15/03/2021 19:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కోహ్లీసేనకు జరిమానా వేసిన జవగళ్‌ శ్రీనాథ్‌

అహ్మదాబాద్‌: ఇంగ్లాండ్‌తో రెండో టీ20లో స్లో ఓవర్‌రేట్‌ కారణంగా టీమ్‌ఇండియా ఆటగాళ్లపై జరిమానా విధించారు. మ్యాచు ఫీజులో 20% కోత విధిస్తున్నట్లు ఐసీసీ తెలిపింది. నిర్దేశించిన సమయంలో కోహ్లీసేన 19 ఓవర్లను మాత్రమే వేయగలిగింది. ఒక ఓవర్‌ వేసేందుకు అదనపు సమయం తీసుకోవడంతో మ్యాచ్‌ రిఫరీ జవగళ్‌ శ్రీనాథ్‌ జరిమానా వేశారు. తాము తప్పు చేసినట్టు కెప్టెన్‌ కోహ్లీ అంగీకరించడంతో విచారణేమీ జరగలేదు.

రెండో టీ20లో టీమ్‌ఇండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఐదు టీ20ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ను భారత బౌలర్లు 164/6కే పరిమితం చేశారు. నెమ్మది బంతులతో వారిని బోల్తా కొట్టించారు. ఆ తర్వాత ఛేదనకు దిగిన టీమ్‌ఇండియా పరుగులేమీ చేయకుండా రాహుల్‌ (0; 6 బంతుల్లో) వికెట్‌ చేజార్చుకుంది. ఈ క్రమంలో అరంగేట్రం ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ (56; 32 బంతుల్లో 5×4, 4×6), విరాట్‌ కోహ్లీ (73*; 49 బంతుల్లో 5×4, 3×6), రిషభ్ పంత్‌ (26; 13 బంతుల్లో 2×4, 2×6) జట్టును గెలుపు బాటలో నడిపించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని