Sunrisers Hyderabad:బెయిర్‌ స్టో స్థానంలో ఎవరిని తీసుకున్నారంటే? - ipl 2021: srh sign sherfane rutherford to replace jonny bairstow in the uae leg
close
Published : 12/09/2021 01:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Sunrisers Hyderabad:బెయిర్‌ స్టో స్థానంలో ఎవరిని తీసుకున్నారంటే?

(Photo:Sunrisers Hyderabad Twitter)

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఎల్ 2021 సీజన్ రెండో దశ ముంగిట సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు విధ్వంసకర ఓపెనర్ జానీ బెయిర్‌ స్టో వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్‌ నుంచి వైదొలిగాడు. ఈ పరిణామం జరిగిన గంటల వ్యవధిలోనే సన్‌రైజర్స్‌.. బెయిర్‌ స్టో స్థానంలో వెస్టిండీస్ క్రికెటర్‌ షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌ని జట్టులోకి తీసుకుంది. ఈ విషయాన్ని సన్‌రైజర్స్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. ‘విధ్వంసకర కరేబియన్ ఆటగాడు షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌ ఇప్పుడు సన్‌రైజర్స్‌ ఆటగాడు. ఐపీఎల్ 2021 రెండో దశ కోసం అతడు బెయిర్‌ స్టో స్థానంలో జట్టులోకి వచ్చాడు’ అని సన్‌రైజర్స్ ట్వీట్‌ చేసింది. 

యూఏఈలో జరగనున్న ఐపీఎల్ రెండో దశకు మరో ఇద్దరు ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు సైతం దూరం అయ్యారు. పంజాబ్ కింగ్స్ ఆటగాడు డేవిడ్ మలన్‌, దిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్‌ క్రిస్‌వోక్స్‌ వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్‌ నుంచి వైదొలిగారు.

టీమ్ఇండియా, ఇంగ్లాండ్ మధ్య మాంచెస్టర్ వేదికగా శుక్రవారం నుంచి ఐదో టెస్టు మ్యాచ్ జరగాల్సి ఉండగా.. భారత బృందంలో కరోనా కేసులు నమోదవడంతో మ్యాచ్‌ని రద్దు చేశారు. ఈ రద్దు ప్రకటన వెలువడిన ఒక రోజు వ్యవధిలోనే ఐపీఎల్ 2021 సీజన్‌ నుంచి బెయిర్‌స్టో, డేవిడ్‌ మలన్‌, క్రిస్‌వోక్స్‌ తప్పుకోవడం గమనార్హం. సెప్టెంబరు 19 నుంచి ఐపీఎల్-14 సీజన్‌ పున:ప్రారంభంకానున్న విషయం తెలిసిందే.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని