కాంగోలో ఇటలీ రాయబారి దారుణ హత్య - italian ambassador among three killed in attack on un convoy in congo
close
Published : 23/02/2021 12:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కాంగోలో ఇటలీ రాయబారి దారుణ హత్య

బ్రాజ్జవిల్లే: కాంగోలో శాంతి స్థాపనకు కృషి చేస్తున్న ఇటలీ రాయబారి దారుణ హత్యకు గురయ్యారు. గోమా పట్టణంలో ఐరాస వాహన శ్రేణిలో వెళుతున్న రాయబారి లూకా అటాన్సియాపై సాయుధులు కాల్పులకు తెగబడ్డారు. దాడి సమయంలో కారులో ఐదుగురు ప్రయాణిస్తుండగా లూకాతో పాటు మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. గాయపడినవారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. 

సహజ వనరులు పుష్కలంగా ఉంగే కాంగో ప్రస్తుతం అంతర్యుద్ధంతో అట్టుడుకుతోంది. కాగా శాంతి స్థాపనకు ఐక్యరాజ్య సమితి కృషి చేస్తుండగా, అది సహించని తిరుగుబాటు బృందాలు ప్రముఖులపై దాడికి తెగబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటలీ రాయబారిని హత్య చేసినట్లు అధికారులు వెల్లడించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని