Royal Navy: ‘జేమ్స్‌ బాండ్‌’ డేనియల్‌ క్రెయిగ్‌కు అరుదైన గౌరవం - james bond daniel craig appointed honorary royal navy commander
close
Published : 24/09/2021 01:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Royal Navy: ‘జేమ్స్‌ బాండ్‌’ డేనియల్‌ క్రెయిగ్‌కు అరుదైన గౌరవం

ఇంటర్నెట్‌ డెస్క్‌: జేమ్స్‌ బాండ్‌ పాత్రలో తనదైన పెర్ఫార్మెన్స్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు డేనియల్‌ క్రెయిగ్‌. ఆయన యాక్షన్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. జేమ్స్‌ బాండ్‌ సిరీస్‌లో ఇప్పటికే నాలుగు సినిమాలు చేసిన ఆయన త్వరలో ‘నో టైం టు డై’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయనకు ఓ అరుదైన గౌరవం దక్కింది. గురువారం ఆయన బ్రిటీష్‌ రాయల్‌ నేవీలో గౌరవ కమాండర్‌గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని ‘జేమ్స్‌ బాండ్‌’ తన అధికారిక ట్విటర్‌ ఖాతా ద్వారా వెల్లడించింది. సీనియర్‌ సర్వీసులో గౌరవ కమాండర్‌ హోదాలో నియామకం కావడాన్ని డేనియల్‌ విశేషంగా, గౌరవంగా భావిస్తున్నట్లు  అందులో పేర్కొంది. మరోవైపు భారత్‌లో సెప్టెంబరు 30న విడుదల కానున్న ‘నో టైమ్ టు డై’ జేమ్స్‌ బాండ్‌ సిరీస్‌లో 25వ సినిమా కావడం విశేషం. ఈ చిత్రానికి క్యారీ జోజి దర్శకత్వం వహిస్తున్నారు. జేమ్స్‌ బాండ్‌గా ఇది క్రెయిగ్‌కు చివరి చిత్రం కావడం గమనార్హం.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని