‘క్రిష్‌ 4’లో కృతి? - kriti sanon pair with hrithik roshan
close
Published : 04/08/2020 11:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘క్రిష్‌ 4’లో కృతి?

ముంబయి: హృతిక్‌ రోషన్‌ తదుపరి చిత్రం ‘క్రిష్‌ 4’ అంటూ వార్తలొస్తున్నాయి. తన తండ్రి రాకేష్‌ రోషన్‌ తెరకెక్కించనున్న ఈ చిత్రంలో ఆయన నాలుగు పాత్రల్లో కనిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. స్క్రిప్టు పనులు మొదలుపెట్టినట్టు రాకేష్‌ రోషన్‌ చెప్పిన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ సినిమాలో హృతిక్‌ సరసన నటించబోయే నాయిక గురించి ఓ వార్త సందడి చేస్తోంది. ఇందులో కృతిసనన్‌ నటించబోతున్నట్టు బాలీవుడ్‌లో అనుకుంటున్నారట. దీనికి సంబంధించిన కృతితో ఒప్పందం కుదిరినట్టుగా సమాచారం. క్రిష్‌ సిరీస్‌ చిత్రాల్లో హృతిక్‌కు జోడీగా నటించిన ప్రియాంక ఇప్పుడు హాలీవుడ్‌ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రియాంకను ఈ కొత్త చిత్రంలో నటింపచేయడం అంత సులువుకాదని చిత్రబృందం భావించిందట.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని