ఉపాసన షేర్‌ చేసిన ‘నాట్యం’ఫస్ట్‌లుక్‌! - kuchipudi dancer sandhya rajus first-look from dance film natyam
close
Published : 23/01/2021 12:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉపాసన షేర్‌ చేసిన ‘నాట్యం’ఫస్ట్‌లుక్‌!

హైదరాబాద్‌: రామచరణ్‌ సతీమణి, మహిళా వ్యాపారవేత్త ఉపాసన కొణిదెల ‘నాట్యం’ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. శనివారం ట్విటర్‌ వేదికగా పంచుకున్న ఈ ఫస్ట్‌లుక్‌ నెటిజన్లను ఆకర్షిస్తోంది. ప్రముఖ కూచిపూడి నాట్యకారిణి సంధ్యారాజు ప్రధానపాత్రలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది.  పోస్టర్‌లో ఆమె నటరాజు భంగిమలో ఆకట్టుకున్నారు.

వివాహం తర్వాత ఒక నాట్య కళాకారిణి ఎన్నో అడ్డంకులను దాటుకుని నృత్యంలో తన లక్ష్యాలను ఎలా చేరుకుందనే నేపథ్యంలో చిత్రం సాగనుంది. హంపి, లేపాక్షి, బెంగళూరు, హైదరబాద్‌ పరిసర ప్రాంతాల్లోని ప్రముఖ ఆలయాల్లో నృత్యానికి సంబంధించి కీలకమైన సన్నివేశాలు ఇప్పటికే షూట్‌ చేసినట్టు చిత్రబృందం తెలిపింది. రేవంత్‌ కోరుకొండ రచించి, దర్శకత్వం వహిస్తున్నారు. కమల్‌ కామరాజ్‌, శుభలేఖ సుధాకర్‌, భానుప్రియ ఇతర ప్రధాన పాత్రలలో నటిస్తుండగా, శ్రవణ్‌ భరద్వాజ్‌ సంగీతం అందిస్తున్నారు.

ఇవీ చదవండి!

స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరో, హీరోయిన్‌

‘గీతా’లాపన.. జారిపడ్డ జెనీ.. తమన్నా వర్కౌట్‌
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని