వాహ్‌! అనిపిస్తున్న ‘సారంగదరియా..’ - love story movie saranga dariya song
close
Published : 28/02/2021 11:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వాహ్‌! అనిపిస్తున్న ‘సారంగదరియా..’

హైదరాబాద్‌: ఎన్ని పాటలు వచ్చిన జానపద గీతాలకు ఉండే క్రేజే వేరు. అలాంటి జానపదానికి సాయిపల్లవి వంటి ఎనర్జిటిక్‌ హీరోయిన్‌‌ స్టెప్స్‌ తోడైతే  కనువిందే. అలాంటి పాటే  ‘సారంగదరియా..’అంటూ వచ్చేసింది. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా ‘లవ్‌స్టోరీ’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.  కాగా, ‘సారంగదరియా’అంటూ సాగుతున్న పాట లిరికల్‌ వీడియోను తాజాగా మరో నటి సమంత విడుదల చేశారు. సుద్దాల ఆశోక్‌తేజ అందించి సాహిత్యానికి గాయని మంగ్లీ మ్యాజిక్‌ వాయిస్‌ తోడవడంతో మరోసారి వినాలనిపించేంత అద్బుతంగా పాట ఉంది. పవన్‌ సీహెచ్‌ అందించిన మంచి బీట్‌తో కూడిన సంగీతం పాట విన్నవాళ్లు స్టెప్పులు వేసేంత ఊపునిస్తుంది. అమిగోస్‌ క్రియేషన్స్‌పై తెరకెక్కిన ‘లవ్‌స్టోరీ’ ఏప్రిల్‌ 16న ప్రేక్షకుల ముందుకు  రానుంది. మరి అప్పటి వరకు ఈ సాంగ్‌ వింటూ ఎంజాయ్‌ చెయ్యండి!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని