nag ashwin: 'రాధేశ్యామ్‌' తర్వాతే కొత్త కబురు - nag ashwin reveals update on prabhas deepika padukone movie
close
Published : 12/10/2021 01:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

nag ashwin: 'రాధేశ్యామ్‌' తర్వాతే కొత్త కబురు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’ వచ్చే సంక్రాంతికి వస్తున్న విషయం తెలిసిందే. విడుదల తేదీ మారుతుందని వచ్చిన వార్తలను కొట్టిపారేసి, పండగ బరిలోనే ఉన్నట్లు చిత్రబృందం మరోసారి స్పష్టం చేసింది. అభిమానుల చూపంతా నాగ్‌ఆశ్విన్‌తో చేస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ పై పడింది. దీపికా పదుకొణె, అమితాబ్‌ బచ్చన్‌లతో పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిస్తుండటంతో దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆక్టోబరు 23న ప్రభాస్‌ పుట్టినరోజు.  దీంతో ‘ప్రాజెక్ట్‌ కె’ కొత్త కబురు కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  ‘అప్‌డేట్‌ లేదా?’ అని అడుగుతూ.. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ని ప్రభాస్‌ అభిమాని ఒకరు ట్విటర్‌లో ట్యాగ్‌ చేశారు. దానికి ఆయనిచ్చిన సమాధానం అభిమానుల్ని నిరాశకు గురిచేసింది. ‘రాధేశ్యామ్‌’ విడుదలైన తర్వాతే సినిమాకు సంబంధించిన కొత్త కబురు వస్తుందని బదులిచ్చారు. అంటే సంక్రాంతి దాకా ఎలాంటి అప్‌డేట్‌ లేదనే విషయం అర్థమవుతోంది. ప్రభాస్‌ పుట్టినరోజున ‘సలార్’‌, ‘ఆదిపురుష్‌’ చిత్రాల నుంచి కొత్తకబుర్లు వచ్చే అవకాశం ఉందని చిత్రవర్గాల సమాచారం. వీటితో పాటు ‘అర్జున్‌ రెడ్డి’ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగాతో ‘స్పిరిట్‌’ అనే సినిమానూ ప్రభాస్‌ ఓకే చేశారు. 


Advertisement


మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని