ఇలాంటి పాత్రలను హీరోలు ఒప్పుకోరు..! - normally actors would not accept such tough roles says raghava lawrence
close
Updated : 09/11/2020 20:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇలాంటి పాత్రలను హీరోలు ఒప్పుకోరు..!

ముంబయి: ‘లక్ష్మీ’లాంటి సినిమాల్లో నటించడానికి సాధారణంగా కథానాయకులు ఒప్పుకోరని దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్‌ అన్నారు. దక్షిణాదిలో హిట్‌ అందుకున్న ‘కాంచన’ను హిందీలో ‘లక్ష్మీ’గా రీమేక్‌ చేసిన సంగతి తెలిసిందే. మాతృకలో నటించి, తెరకెక్కించిన లారెన్స్‌ దీన్ని రూపొందించారు. కియారా అడ్వాణీ కథానాయిక పాత్ర పోషించారు. కొన్ని మార్పులతో హిందీ ప్రేక్షకులకు తగ్గట్టు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అక్షయ్‌ తన దాదాపు 20 ఏళ్ల కెరీర్‌లో తొలిసారి చీరకట్టి, బొట్టు, గాజులతో కనిపించారు. ఇప్పటి వరకు విడులైన సినిమా ప్రచార చిత్రాలు అంచనాల్ని పెంచాయి. సోమవారం ఈ చిత్రం ఓటీటీ వేదికగా విడుదల కాబోతోంది.

ఈ సందర్భంగా లారెన్స్‌ సోషల్‌మీడియాలో ప్రత్యేక పోస్ట్‌ చేశారు. ‘లక్ష్మీ’ గురించి ముచ్చటిస్తూ.. ‘నేను దర్శకుడిగా బాలీవుడ్‌కు పరిచయం కాబోతున్న సినిమా డిస్నీ+హాట్‌స్టార్‌లో సోమవారం సాయంత్రం 7.05 గంటలకు విడుదల కాబోతోంది. తమిళ సినిమా ‘కాంచన’ ద్వారా ట్రాన్స్‌జెండర్ల ఆవేదన, సమస్యల్ని తెలియజేయాలనుకున్నా. ఆ చిత్రానికి ట్రాన్స్‌జెండర్ల కమ్యూనిటీతోపాటు ప్రేక్షకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. అక్షయ్‌ సర్‌ లాంటి స్టార్‌ హిందీ రీమేక్‌లో నటిస్తే.. ఈ సందేశం ప్రతి ఒక్కరికీ చేరుతుందని ఆశిస్తున్నాను. సాధారణంగా ఇలాంటి కష్టమైన పాత్రలు చేయడానికి నటులు ఒప్పుకోరు. కానీ అక్షయ్‌ సర్‌ సమాజం గురించి ఆలోచించే గొప్ప వ్యక్తి. గతంలో ఎన్నో సందేశాత్మక చిత్రాల్లో నటించారు. అందుకే ఆయన ఈ సినిమాకు ఒప్పుకుంటారని అనుకున్నా. ఈ పాత్రలో నటించేందుకు అంగీకరించినందుకు అక్షయ్‌ సర్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నా. ఈ సినిమా ప్రక్రియలో సాయం చేసిన సోదరి షబితా, తుషార్‌ సర్‌, నటించిన కియారా అడ్వాణీ, డీవోపీ వెట్రి, సహ దర్శకులు, సాంకేతిక నిపుణులతోపాటు మొత్తం చిత్ర బృందానికి థాంక్స్‌. హిందీ ప్రేక్షకులు కూడా ఈ సినిమాను చూసి ఎంజాయ్‌ చేస్తారని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని