HappyBirthDayNTR: శుభాకాంక్ష‌ల వెల్లువ‌ - ntr birthday wishes
close
Published : 20/05/2021 15:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

HappyBirthDayNTR: శుభాకాంక్ష‌ల వెల్లువ‌

ఇంట‌ర్నెట్ డెస్క్‌:  ప్ర‌ముఖ న‌టుడు ఎన్టీఆర్ అంటే స‌గ‌టు ప్రేక్ష‌కుల‌కే కాదు సినీ ప్ర‌ముఖులకూ ఎంతో అభిమానం. ఎన్టీఆర్ చెప్పే భారీ డైలాగులకు, క‌ళ్లు చెదిరే డ్యాన్సుల‌కు వాళ్లూ ఫిదా అవుతుంటారు. నేడు తార‌క్ పుట్టిన రోజు సంద‌ర్భంగా సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ త‌మ ఇష్టాన్ని ఇలా చాటుకున్నారు.

* ఈ త‌రానికి చెందిన ఆల్ రౌండ‌ర్‌, ప్ర‌తిభావంతుడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ గారికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు. కొవిడ్ నుంచి మీరు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్నా. - ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి.

* పుట్టినరోజు శుభాకాంక్ష‌లు తార‌క్‌. నువ్వు ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాల‌ని కోరుకుంటున్నా. - న‌టుడు వెంక‌టేశ్‌.

* హ్యాపీ బ‌ర్త్‌డే తార‌క్‌. మీరెప్పుడూ సంతోషంగా ఉండాల‌ని కోరుకుంటున్నా. జాగ్ర‌త్త‌గా ఉండండి బ్ర‌ద‌ర్‌. - న‌టుడు మ‌హేశ్ బాబు.

* పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు బ్ర‌ద‌ర్ అంటూ ఆర్ఆర్ఆర్ చిత్రంలోని తార‌క్ కొత్త పోస్ట‌ర్‌ని అభిమానుల‌తో పంచుకున్నారు న‌టుడు రామ్ చ‌ర‌ణ్‌.

* ఆయ‌న పేరే ఒక ఇతిహాసం.. నంద‌మూరి తార‌క రామునికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు. - మాట‌ల ర‌చ‌యిత సాయి మాధ‌వ్ బుర్రా.

* మీతో నాకు రెండు ద‌శాబ్దాలుగా ప‌రిచ‌యం ఉంది. మీరు హృద‌యానికి ద‌గ్గ‌ర‌య్యారు. పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు ఎన్టీఆర్‌. - ద‌ర్శ‌కుడు ర‌మేశ్ వ‌ర్మ‌.

హ్యాపీ బ‌ర్త్‌డే తార‌క్‌. మీరు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నా. - న‌టి ర‌కుల్ ప్రీత్ సింగ్‌.








మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని