వీడియో టాక్‌: కలిసి కనిపించిన పవన్‌-ఆలీ! - pawan kalyan and ali a wedding
close
Published : 21/02/2021 11:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వీడియో టాక్‌: కలిసి కనిపించిన పవన్‌-ఆలీ!

నెట్టింట్లో షేర్‌ చేసిన హాస్యనటుడి సతీమణి

హైదరాబాద్‌: ప్రాణస్నేహితులు పవన్‌కల్యాణ్‌, ఆలీ తాజాగా ఒకస్టేజ్‌పై కలిసి కనిపించారు. కొద్దిసమయంపాటు నవ్వుతూ మాట్లాడుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. అగ్రకథానాయకుడు పవన్‌కల్యాణ్‌, హాస్యనటుడు ఆలీ ఎంతో కాలం నుంచి ఆప్త మిత్రులనే విషయం తెలిసిందే. అందుకే, పవన్‌ నటించిన చాలా సినిమాల్లో ఆలీ ఎక్కువగా కనిపిస్తుంటారు. అయితే, 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న కొన్ని పరిణామాల తర్వాత వీరిద్దరూ ఉన్న  ఫొటోలు ఏమీ బయటకు రాలేదు.

కాగా, రెండురోజుల క్రితం ఆలీ బంధువుల నివాసంలో ఓ వివాహం జరిగింది. ఈ వేడుకలకు ఇటు ఆలీ కుటుంబంతోపాటు అటు పవన్‌కల్యాణ్‌ కూడా హాజరయ్యారు. వధూవరులకు అభినందనలు తెలిపిన అనంతరం పవన్‌కల్యాణ్‌తో ఆలీ, ఆయన సతీమణి సెల్ఫీ తీసుకున్నారు. అంతేకాకుండా ఆలీ.. పవన్‌తో నవ్వుతూ మాట్లాడడం.. పవన్‌ కూడా సరదాగా మాట్లాడారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోను ఆలీ సతీమణి జుబేదా సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఇది చూసిన నెటిజన్లు ఎంతో సంతోషిస్తున్నారు. దీంతో ఈ వీడియో కాస్త వైరల్‌గా మారింది.

ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పవన్‌కల్యాణ్‌.. మలయాళీ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియం’ రీమేక్‌లో బిజీగా పాల్గొంటున్నారు. దీనితోపాటు ఆయన క్రిష్‌తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇవి మాత్రమే కాకుండా పవన్‌ హీరోగా హరీశ్‌ శంకర్‌ డైరెక్షన్‌లో ఓ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనుంది. మరోవైపు ‘వకీల్‌సాబ్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని