కొవిడ్ కేంద్రాల్లో రక్షణ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి?: పవన్‌ - pawan kalyan on vijayawada fire accident
close
Updated : 09/08/2020 13:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్ కేంద్రాల్లో రక్షణ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి?: పవన్‌

అమరావతి : విజయవాడలోని కొవిడ్ కేంద్రంలో అగ్ని ప్రమాదం హృదయవిదారకమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. స్వర్ణ ప్యాలెస్‌లో ఉన్న కొవిడ్ కేర్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకొని పలువురు మృత్యువాత పడ్డారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానన్నారు.

‘కరోనా వైరస్‌తో బాధపడుతూ చికిత్స కోసం ఇక్కడ చేరినవారు ఈ విధంగా ప్రమాదం బారినపడటం అత్యంత విషాదం. మృతుల కుటుంబాలకు నా తరఫున, జనసేన పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. గాయపడినవారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. 

రమేశ్ హాస్పిటల్స్‌కు అనుబంధంగా హోటల్లో నడుస్తున్న ఈ కోవిడ్ కేంద్రంలో రక్షణ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటే అత్యవసర మార్గాల ద్వారా బయటపడే వ్యవస్థలు ఎలా ఉన్నాయి? ఈ ఘటనకు కారణాలు ఏమిటి? లోపాలు ఏమిటో సమగ్ర విచారణ చేయించాలి. ఈ ఘటన నేపథ్యంలో వివిధ హోటళ్లు, భవనాల్లో నడుస్తున్న కోవిడ్ కేంద్రాల్లో రక్షణ చర్యలపై సమీక్ష నిర్వహించాలి’ అని పవన్ కల్యాణ్ కోరారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని