తెరపై యుద్ధం.. పవన్‌-రానా సిద్ధం!  - pawan kalyan rana new movie shoot begins
close
Published : 26/01/2021 13:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెరపై యుద్ధం.. పవన్‌-రానా సిద్ధం! 

హైదరాబాద్‌: పవన్ కల్యాణ్‌, రానా ప్రధానపాత్రల్లో మలయాళీ హిట్‌ సినిమా ‘అయ్యప్పనమ్‌ కోషియమ్‌’ తెలుగు రీమేక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా షూట్‌కు సంబంధించిన ఓ వీడియోను ‘తుపాను మొదలైంది’ అంటూ చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో పోలీసు అధికారిగా నటిస్తున్న పవన్‌కల్యాణ్‌ బుల్లెట్‌పై లాడ్జి వైపు వెళ్తున్న దృశ్యాన్ని చిత్రీకరించడం వీడియోలో కనిపిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌ శివార్లలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. ఫైట్‌ మాస్టర్‌ దిలీప్‌ సుబ్బరాయన్‌ నేతృత్వంలో పవన్‌, రానాలపై యాక్షన్‌ పార్ట్‌ను చిత్రీకరిస్తున్నారు.

సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. త్రివిక్రమ్‌ స్కీన్‌ప్లే, సంభాషణలు అందిస్తుండటం విశేషం. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సముద్రకని, బ్రహ్మజీ, మురళీశర్మ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

ఇవీ చదవండి!

రవితేజ ‘ఖిలాడి’ఎంట్రీ అదుర్స్‌!

సంగీత సామ్రాట్‌కు పద్మవిభూషణ్‌తో సత్కారం
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని