గతాన్ని.. భవిష్యత్తును కలిపే ఫోన్‌ కాల్‌..! - playback teaser dinesh tej ananya nagalla
close
Published : 16/05/2021 00:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గతాన్ని.. భవిష్యత్తును కలిపే ఫోన్‌ కాల్‌..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒక ఫోన్‌కాల్‌ గతాన్ని భవిష్యత్తును కలుపుతుందా..? 1993 నాటి యువతితో ఇప్పటి యువకుడు మాట్లాడటం సాధ్యమేనా..? అదే కాన్సెప్టుతో తెరకెక్కిన చిత్రం ‘ప్లేబ్యాక్‌‘. దినేశ్‌ తేజ్‌, అనన్య నాగళ్ల జంటగా నటించారు. డైరెక్టర్‌ హరిప్రసాద్‌ తెరకెక్కించిన ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మార్చి 5న థియేటర్లలో విడుదలై అలరించింది. ఇప్పడు మే 21న ఓటీటీలో విడుదల కానుంది. ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఆహా’లో ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది.

శ్రీవేంకటేశ్వర ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై ప్రసాద్‌రావు పెద్దినేని నిర్మించారు. స్పందనవల్లి, అర్జున్‌ కల్యాణ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఉత్కంఠభరితమైన టీజర్‌ను ‘ఆహా’ యూట్యూబ్‌లో పంచుకుంది. గతాన్ని, భవిష్యత్తుని కలిపే ఒక ఫోన్‌ కాల్‌ వల్ల 1993 నాటి ఒక అమ్మాయితో ఇప్పటి హీరోకు పరిచయం ఏర్పడుతుంది. అలా క్రమంగా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మరి ఇద్దరు ఒకర్నొకరు కలుసుకున్నారా..? కలుసుకుంటే అదెలా సాధ్యమైంది. ఆ తర్వాత ఏం జరిగింది అన్నదే సినిమా కథ. ఆసక్తికరంగా ఉన్న టీజర్‌ను మీరూ చూసేయండి మరి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని