విజయ్‌ సినిమా.. ఎదురుచూస్తోన్న: పూజా - pooja hegde opens up on being approached for vijay movie
close
Published : 27/02/2021 15:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విజయ్‌ సినిమా.. ఎదురుచూస్తోన్న: పూజా

చెన్నై: కోలీవుడ్‌లో తెరకెక్కిన ‘ముగముది’తో నటిగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన భామ పూజాహెగ్డే. 2012లో విడుదలైన ఈ సినిమా తర్వాత పూజా దక్షిణాదిలో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్నప్పటికీ కోలీవుడ్‌లో మాత్రం ఏ సినిమాలోనూ నటించలేదు. కాగా, ఎనిమిదేళ్ల తర్వాత ఆమె కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందంటూ గత కొన్నిరోజులుగా నెట్టింట్లో ప్రచారం సాగుతోంది. స్టార్‌ హీరో విజయ్‌ సరసన ఆమె నటించనున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

సదరు వార్తలపై తాజాగా నటి పూజాహెగ్డే స్పందించారు. విజయ్‌తో సినిమా కోసం తాను ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని అన్నారు. ‘ఒకవేళ విజయ్‌65లో నేను భాగమైతే.. అదంతా నా అదృష్టమనే అనుకుంటాను. ఎందుకంటే కోలీవుడ్‌ సినిమాతోనే నా కెరీర్‌ ప్రారంభమైంది. ఆ తర్వాత ఎన్నోసార్లు తమిళ సినిమాలో నటించాలని అనుకున్నాను. కానీ సరైన అవకాశం రాలేదు. ఇప్పుడైనా విజయ్‌ సినిమాలో నటించే అవకాశం నన్ను వరిస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నా. అలాగే, విజయ్‌తో స్క్రీన్‌ పంచుకోవాలని రాసిపెట్టి ఉంటే తప్పకుండా జరుగుతుంది’’ అని ఆమె తెలిపారు.

ఇక ప్రస్తుతం పూజా హెగ్డే తెలుగులో తెరకెక్కిన ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’, ‘రాధేశ్యామ్‌’ సినిమాల్లో నటించారు. జూన్‌ 19న ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ విడుదల కానుండగా.. జులై 30న ‘రాధేశ్యామ్‌’ ప్రేక్షకుల ముందుకు రానుంది. వీటితోపాటు రామ్‌చరణ్‌కు జోడీగా ‘ఆచార్య’ సినిమాలో పూజా ఓ కీలకపాత్ర పోషించనున్నారు. అలాగే బాలీవుడ్‌లో తెరకెక్కుతోన్న ‘సర్కస్‌’లో ఈమె కథానాయిక.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని