ప్రభాస్‌ కొత్త కారు ఖరీదు అంతా? - prabhas buys new luxury car worth rs 6 crore
close
Published : 29/03/2021 13:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రభాస్‌ కొత్త కారు ఖరీదు అంతా?

ఇంటర్నెట్‌డెస్క్‌: వరుస సినిమాలతో పాన్‌ ఇండియా స్థాయిలో అలరించేందుకు అగ్ర కథానాయకుడు ప్రభాస్‌ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండే ప్రభాస్‌.. ఆయనకు సంబంధించిన ఒక విషయం మాత్రం ప్రస్తుతం తెగ వైరల్‌ అవుతోంది. ఇటీవల ప్రభాస్‌ అత్యంత ఖరీదైన లంబోర్గిని ‘అవెంటిడోర్‌ రోడ్‌స్టర్‌’ కారును కొనుగోలు చేశారట. ఇందుకు సంబంధించిన ఫొటోలు అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంటున్నారు. ఇంతకీ ఈ కారు ఖరీదు చెప్పలేదు కదూ! అక్షరాల రూ.6కోట్లట.

తన తండ్రి సూర్యనారాయణరాజు జయంతిని పురస్కరించుకుని ప్రభాస్‌ ఈ కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ప్రభాస్‌ తండ్రి నిర్మాత పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. గతంలోనూ ఓ ఇంటర్వ్యూ ప్రభాస్‌ మాట్లాడుతూ.. లంబోర్గిని కారును కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు చెప్పారు.

ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్‌’, ప్రశాంత్‌ నీల్‌తో ‘సలార్‌’, ఓం రౌత్‌తో ‘ఆది పురుష్‌’తో పాటు, నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ క్రేజీ ప్రాజెక్టులో నటిస్తున్నారు.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని