close
Published : 29/01/2021 07:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘నీలి నీలి ఆకాశం’ కోసం మూడు నెలలు కష్టపడ్డా!

హైదరాబాద్‌: ప్రముఖ వ్యాఖ్యాత ప్రదీప్ మాచిరాజు కథానాయకుడిగా వెండితెరకు పరిచయం అవుతున్న తొలి చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’. మున్నా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ‘ఈటీవీ’తో తన తొలి సినిమా అనుభవాలను పంచుకున్నారు ప్రదీప్. 10 ఏళ్ల బుల్లితెర కెరీర్‌లో సినిమా కథానాయకుడిగా మారడానికి దర్శకుడు మున్నా చెప్పిన కథే కారణమని చెప్పారు.

గతంలో అనేక అవకాశాలు వచ్చినా కథలు నచ్చకనే సినిమాలు చేయలేదని ఈ సందర్భంగా ప్రదీప్‌ అన్నారు. తన తొలి సినిమా ఇంటిల్లిపాదినీ అలరించేలా ఉంటుందని పేర్కొన్నారు. ఈ సినిమా తర్వాత చేయబోయే ప్రతి సినిమా తనకు తొలి సినిమాగానే భావిస్తానని, త్రివిక్రమ్, సుకుమార్ లాంటి దర్శకులు చిత్రాల్లో హీరోగా నటించే స్థాయికి ఎదుగుతానని అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...

* చిన్నప్పటి నుంచి చాలా యాక్టివ్‌గా ఉండేవాడిని. చదువు పూర్తయిన తర్వాత 9 టు 5 జాబ్‌ చేయడమంటే ఇష్టముండేది కాదు. అందుకే ఏదైనా కొత్తగా ప్రయత్నించాలని రేడియో జాకీగా చేరా. అప్పుడు హీరోలను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నాకు సినిమాలపై మరింత ఆసక్తి పెరిగింది.

* స్కూల్‌లో చదువుకునే రోజుల్లోనే బాగా సినిమాలు చూసేవాడిని. మరీ ముఖ్యంగా ‘తమ్ముడు’ సినిమా ఏకంగా 9 సార్లు చూశా. ఆ దెబ్బతో టికెట్‌ కౌంటర్‌లో ఉండే వ్యక్తి కూడా బాగా పరిచయం అయిపోయాడు.

* నేను సినిమాలు చూసిన థియేటర్‌లోనే నా సినిమా పోస్టర్‌ను చూసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నా కుటుంబ సభ్యులు కూడా చాలా హ్యాపీ. ‘కష్టపడితే ప్రతిఫలం తప్పకుండా వస్తుంది. నీ మొదటి షో హిట్టయిన తర్వాత నీ ప్రయాణాన్ని ఏవిధంగానైతే కొనసాగించావో.. అలాగే ఈ ప్రయాణాన్ని కొనసాగించు’ అని నాన్న చెబుతుంటారు. ‘తెరలో తేడా ఉండవచ్చు కానీ, నీలో ఎప్పుడూ తేడా ఉండకూడదు’ అని నన్ను ఎప్పుడూ ప్రోత్సహించేవారు.

* ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ కథలో వేరియేషన్స్‌ నాకు బాగా నచ్చాయి. నేను తెలుగు ప్రేక్షకులందరికీ బాగా తెలుసు. అలాంటప్పుడు ఓ చందమామ కథతో వస్తేనే బాగుంటుందని అనిపించింది. నా పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది. ‘నీలి నీలి ఆకాశం’ పాటలో గెటప్‌ కోసం మూడు నెలలు కష్టపడ్డా!

* మెగాస్టార్‌ చిరంజీవిగారు, రవితేజగారు ఇలా పలువురు హీరోలు నాకు స్ఫూర్తి. ఇండస్ట్రీలో ఎవరి సపోర్ట్‌ లేకుండా పైకి వచ్చారు. కథను నమ్మి వాళ్లు సినిమాలు చేశారు. ఈ సినిమా మొదటి కాపీ చూసిన తర్వాత నాకు అదే నమ్మకం కలిగింది. మంచి సినిమా తీశామన్న సంతృప్తి కలిగింది.

* సినిమా ఇండస్ట్రీతో సంబంధం లేని పదిమందికి సినిమా చూపించాం. వాళ్లందరూ భావోద్వేగానికి గురయ్యారు. సినిమా బాగుందని మెచ్చుకున్నారు. అలాగే తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందని భావిస్తున్నా. ఒక పాటకు 300 మిలియన్‌ వ్యూస్‌ రావటం మామూలు విషయం కాదు. ఆటంకాలు ఎన్ని ఎదురైనా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని