శంకర్‌-చరణ్‌ మూవీ: ఆ షరతులు పెట్టారా? - producer dil raju set conditions for shankar movie
close
Updated : 22/02/2021 18:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శంకర్‌-చరణ్‌ మూవీ: ఆ షరతులు పెట్టారా?

ఇంటర్నెట్‌డెస్క్‌: రామ్‌చరణ్‌ కథానాయకుడిగా స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కునున్న సంగతి తెలిసిందే. దిల్‌రాజు నిర్మాతగా ఇటీవల ఈ సినిమాను ప్రకటించారు. కొత్త చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది.

భారీ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌ శంకర్‌. ఇప్పటివరకూ ఆయన ఒక్క తెలుగు హీరోతో కూడా సినిమా చేయలేదు. రామ్‌చరణ్‌ హీరోగా సినిమా అనే సరికి అంచనాలు పెరిగాయి. అదే సమయంలో శంకర్‌తో సినిమా అంటే మెగా అభిమానులు కాస్త భయపడుతున్నారు. కారణం ఆలస్యం. ఇప్పటివరకూ శంకర్‌ తీసిన ప్రాజెక్టులన్నీ కనీసం రెండు మూడేళ్లు సాగినవే. ఇలాంటి పరిస్థితుల్లో తమ హీరో సినిమా కోసం రెండేళ్లు వేచి చూడాలా? అని అభిమానులు నిరుత్సాహ పడుతున్నారు.

సినిమా విషయంలో పక్కా ప్రణాళికాబద్ధంగా వెళ్లే నిర్మాతల్లో దిల్‌రాజు ఒకరు. ప్రతి సినిమాను ఎంతో జాగ్రత్తగా దగ్గరుండి చూసుకుంటారు. ఇదే ఫార్ములాను శంకర్‌-చెర్రీ సినిమా మేకింగ్‌ విషయంలోనూ పాటిస్తున్నారట. ఎట్టిపరిస్థితుల్లోనూ సినిమాను అనుకున్న బడ్జెట్‌లో, అనుకున్న సమయానికి చేసి తీరాల్సిందేనని అంటున్నారట. ఇదే విషయాన్ని శంకర్‌ దృష్టికి తీసుకెళ్లారట. సినిమా మేకింగ్‌ విషయంలో దిల్‌రాజు సూచనలకు శంకర్‌ కూడా అంగీకారం తెలిపినట్లు సమాచారం. ప్రస్తుతం చరణ్‌ ‘ఆర్ఆర్‌ఆర్‌’, ‘ఆచార్య’ చిత్రాల్లో బిజీగా ఉన్నారు. ఇవి పూర్తయిన వెంటనే శంకర్‌తో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని