close
Published : 18/04/2021 19:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నాకిలా కావడానికి డాక్టర్‌ కారణం: నటి

చెన్నై: చర్మ సౌందర్యాన్ని కాపాడుకునేందుకు అవసరమైన చికిత్స తీసుకున్న ఓ నటికి చేదు అనుభవం ఎదురయ్యింది. కథానాయికగా ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న కోలీవుడ్‌ నటి రైజా విల్సన్‌. ధనుష్‌ కథానాయకుడిగా నటించిన ‘వి.ఐ.పి-2’తో నటిగా వెండితెరకు పరిచయమైన రైజా ఇప్పుడిప్పుడే హీరోయిన్‌గా వరుస అవకాశాలు దక్కించుకుంటూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. కాగా, తాజాగా ఆమె పెట్టిన ఓ ఫొటో ప్రతిఒక్కర్నీ షాక్‌కు గురిచేసింది. ఆ ఫొటోలో రైజా కన్ను కింద కమిలిపోయినట్లు ఉంది. ఇటీవల తాను ఓ స్కిన్‌కేర్‌ వైద్యురాలిని సంప్రదించినట్లు.. ఆమె ఇచ్చిన చికిత్స వల్లే తన చర్మం ఇలా మారినట్లు రైజా తెలిపారు.

‘చెన్నైలోని ఓ ప్రముఖ డెర్మటాలజిస్ట్‌ వద్ద ఇటీవల నేను చికిత్స తీసుకున్నా. అయితే నేను వద్దని చెప్పినప్పటికీ వినకుండా ఆమె ఓ విధానాన్ని ఫాలో అయ్యారు. దాని ఫలితంగా నేను ఇలా మారాను. ఇప్పుడు అదే వైద్యురాలిని కలవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఆమె నా ఫోన్‌ కాల్స్‌కి జవాబునివ్వడం లేదు. అలాగే నన్ను కలవడానికి కూడా ముందుకు రావడం లేదు. ప్రస్తుతం ఆమె ఊరులో లేరని సిబ్బంది చెబుతున్నారు.’ అని రైజా విల్సన్‌ పేర్కొన్నారు.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని