‘దృశ్యం-2’లో రానా..? - rana daggubati to join venkatesh and jeethu joseph film
close
Published : 07/03/2021 18:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘దృశ్యం-2’లో రానా..?

హైదరాబాద్‌: మోహన్‌లాల్‌-మీనా జంటగా నటించిన మలయాళీ చిత్రం ‘దృశ్యం-2’. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ వేదికగా ఇటీవల విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేసేందుకు రంగం సిద్ధమైన విషయం తెలిసిందే. వెంకటేశ్‌-మీనా జంటగా రానున్న ఈ చిత్రానికి మాతృకను తెరకెక్కించిన జీతూ జోసెఫ్‌ దర్శకత్వం వహించనున్నారు. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. అయితే, సినిమా ప్రారంభ వేడుకల్లో నటీనటులతోపాటు రానా పాల్గొనడంతో ఆయన కూడా ఈ సినిమాలో నటించనున్నారంటూ అందరూ చెప్పుకున్నారు. ఈ క్రమంలోనే ‘దృశ్యం-2’లో రానా ఓ పాత్ర పోషిస్తున్నారని నెట్టింట్లో పోస్టులు దర్శనమిస్తున్నాయి. మలయాళంలో మురళీ గోపీ పోషించిన పాత్రను తెలుగులో రానా చేయనున్నారని సమాచారం. అంతేకాకుండా బాబాయ్‌తో స్క్రీన్‌ పంచుకోవడం కోసం రానా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట. అయితే, ఈ వార్తల్లో ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 2014లో విడుదలైన ‘దృశ్యం’కు సీక్వెల్‌గా ‘దృశ్యం-2’ రానున్న విషయం తెలిసిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని