‘ఏబీసీడీ 3’ సిద్ధం అవుతోంది! రెమో డిసౌజా - remo dsouza confirms abcd 3 reveals casting plans
close
Published : 09/02/2021 18:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఏబీసీడీ 3’ సిద్ధం అవుతోంది! రెమో డిసౌజా

ముంబయి: డ్యాన్స్ నేపథ్యంలో ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన బాలీవుడ్ మూవీ ‘ఏబీసీడీ’(any body can dance) ఎంత పెద్ద హిట్టో అందరికి తెలిసిందే. ప్రముఖ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా దర్శకత్వం వహించగా ప్రభుదేవా కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా ద్వారానే కొత్త డ్యాన్సర్లు నటులుగా పరిచయమయ్యారు. వారిలో ధర్మేష్‌ ఒకరు. ఈ సినిమాకు కొనసాగింపుగా వచ్చిన ‘ఏబీసీడీ2’ కూడా మంచి హిట్‌గా నిలిచింది. ఇందులో వరుణ్‌ధావన్‌, శ్రద్ధాకపూర్‌ ఆడి పాడారు. తాజాగా ఈ సీక్వెల్‌లో భాగంగా ‘ఏబీసీడీ3’చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు రెమో తెలిపారు. ప్రస్తుతం స్క్రిప్ట్‌ పనుల్లో ఉన్నట్టు పేర్కొన్నారు. అయితే 2020లో వరుణ్‌, శ్రద్ధా కపూర్‌ జంటగా వచ్చిన ‘స్ట్రీట్‌ డ్యాన్సర్‌’ను ఏబీసీడీ3గా అందరూ భావించారు. కానీ రెమో మాత్రం ఆ చిత్రాన్ని ‘ఏబీసీడీ3’గా పేర్కొన లేదు. రాబోయే సీక్వెల్‌లో కొత్త డ్యాన్సర్లకు, నటులకు అవకాశం ఉండొచ్చని ఆయన తెలిపారు.

ఇవీ చదవండి!

‘సలార్‌’..ఒక మెట్టెక్కాం! 

వావ్‌! ఈమె డ్యాన్స్‌ అద్భుతం: మాధురీ దీక్షిత్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని