‘షెర్ని’ గర్జన వినడానికి సిద్దంగా ఉన్నారా! - sherni - official teaser vidya balan
close
Published : 31/05/2021 22:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘షెర్ని’ గర్జన వినడానికి సిద్దంగా ఉన్నారా!

ఇంటర్నెట్‌ డెస్క్: విద్వాబాలన్‌ ప్రధాన పాత్రలో అమిత్ మసూర్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘షెర్ని’. చిత్రంలో విజయ్ రాజ్, నీరజ్ కబీ, ఐలా అరుణ్, శరత్ సక్సేనా, ముకుల్ చద్దా తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. తాజాగా చిత్రానికి సంబంధించిన టీజర్‌ ఒకటి విడుదలైంది. ఈ సందర్భంగా నటి విద్యాబాలన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్పందిస్తూ..‘‘ఎంత దట్టమైన అడవి ఉన్నా ఆ పులికి వెళ్లే మార్గం తెలుసు’’, ‘షెర్ని’ గర్జన వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా..? సినిమా ట్రైలర్‌ని జూన్‌ 2న విడుదల చేయనున్నాం. జూన్‌లోనే ‘షెర్ని’ని అమెజాన్‌ ప్రైమ్‌వీడియోలో కలుసుకుందాం’’అంటూ వెల్లడించింది. టి-సీరీస్‌ సమర్పణలో అబున్‌దంతియా ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రాన్ని నిర్మించింది. క్రిషన్‌ కుమార్‌, విక్రమ్‌ మల్హోత్రా నిర్మాతలు. విద్యాబాలన్‌ ఇందులో నిజాయితీగల అటవీ అధికారిగా కనిపించనుంది. ‘షెర్ని’ షూటింగ్‌ని మధ్యప్రదేశ్ అడవుల్లో చిత్రీకరించారు. విద్య గత ఏడాది జూలై 30న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ‘శకుంతలా దేవి’ చిత్రంలో నటించి అలరించింది.  
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని