30 కిలోలు తగ్గినా అవమాన పడ్డా: సోనాక్షి
close
Published : 05/07/2020 20:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

30 కిలోలు తగ్గినా అవమాన పడ్డా: సోనాక్షి

ముంబయి: శతృఘ్న సిన్హా వారసురాలిగా బాలీవుడ్‌లో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సోనాక్షి సిన్హా. 2010లో సల్మాన్‌ఖాన్‌ నటించిన బ్లాక్‌బాస్టర్‌ హిట్‌ ‘దబంగ్‌’ చిత్రంతో సోనాక్షి సినీ పరిశ్రమలోకి ఆరంగేట్రం చేసింది. మొదట్లో లావుగా ఉండే సోనాక్షి.. సినిమా కోసం 30 కిలోల బరువు తగ్గింది. సినిమాలో బొద్దుగా.. అందంగా కనిపించి కుర్రాళ్ల మనసును కొల్లగొట్టింది. కానీ, సినిమాల్లోకి రాకముందు, వచ్చిన తర్వాత కూడా తన శరీరాకృతి పట్ల అవమానాలు ఎదుర్కొన్నానని తన అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. 

‘‘చిన్నతనంలో నేను 95 కిలోలు ఉండేదాన్ని. స్కూల్‌లో అందరూ నా శరీర బరువు చూసి ఎగతాళి చేసేవాళ్లు. కానీ అవేవి నేను పట్టించుకోలేదు. నన్ను నేను తక్కువ చేసుకోలేదు. ఎందుకంటే నా బరువు, నా సైజు మించి నేను చేయాల్సినవి చాలా ఉన్నాయి. దబంగ్‌ సినిమా కోసం బరువు తగ్గడం నేను సాధించిన ఓ ఘనతగా భావిస్తా. ఆ విషయంలో గర్వపడతా. కానీ ఇప్పటికీ ప్రజలు నా శరీర బరువు గురించి మాట్లాడుకుంటున్నారు. అయినా వాటిని పట్టించుకోవద్దని నాకు నేను సర్ది చెప్పుకుంటా. ఎందుకంటే ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చానో వారికి తెలియదు కదా! చివరగా.. చెప్పాలంటే నా శరీర బరువు గురించి వారు ఏం ఆలోచిస్తున్నారో నాకు అనవసరం. వాళ్లేమీ నాలాగా బాలీవుడ్‌లో నటించే వ్యక్తులు కాదు’’అని సోనాక్షి చెప్పుకొచ్చింది.

సోనాక్షి సిన్హా.. సల్మాన్‌ఖాన్‌తో ‘దబంగ్‌’ సిరీస్‌తో పాటు రౌడీ రాథోడ్‌, లూటెరా, ఆర్. రాజ్‌కుమార్‌, నూర్‌ వంటి పలు చిత్రాల్లో నటించింది. అభిషేక్‌ బచ్చన్‌తో కలిసి ఆమె నటించిన ‘భూజ్‌’ చిత్రం త్వరలో డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని