Cinema news: మెగాస్టార్‌కు జోడీగా సోనాక్షి - sonakshi sinha to share screen with chiru for bobby film
close
Published : 23/06/2021 22:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema news: మెగాస్టార్‌కు జోడీగా సోనాక్షి

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ బ్యూటీ సోనాక్షి సిన్హా.. మెగాస్టార్‌ చిరంజీవికి జోడీగా నటించనుందా..? త్వరలోనే టాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వనుందా..? అంటే అవుననే అంటున్నాయి సినిమా వర్గాలు. ప్రస్తుతం కొరటాల శివతో కలిసి ‘ఆచార్య’ పనుల్లో బిజీగా ఉన్న చిరు.. డైరెక్టర్‌ బాబీతో కలిసి ఓ సినిమా చేయనున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రకటించారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన సందడి చేసేందుకు బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సోనాక్షి సిన్హాను చిత్రబృందం సంప్రదించిందని వార్తలు వినిపిస్తున్నాయి. రెమ్యునరేషన్‌ కూడా బాగానే చెల్లించేందుకు ఒప్పందం జరిగిందట. అయితే, ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడక తప్పదు.

మరోవైపు చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఆచార్య’ విడుదలకు సిద్ధంగా ఉంది. మే 13న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరుతో పాటు రామ్‌చరణ్‌ కూడా ఓ కీలక పాత్ర పోషించారు. కాజల్‌ అగర్వాల్‌, పూజా హెగ్డే నటిస్తున్నారు. చిరంజీవి ఈ సినిమా తర్వాత మెహర్ రమేశ్‌ దర్శకత్వంలో ‘వేదాళం’ రీమేక్, డైరెక్టర్‌ మోహన్‌రాజాతో కలిసి ‘లూసిఫర్‌’ రీమేక్‌లో నటించనున్నారు. ఆ తర్వాత బాబీ చిత్రం పట్టాలెక్కే అవకాశాలున్నాయి.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని