సోనూసూద్‌ హీరోగా ‘క్రాక్‌’ రీమేక్‌..! - sonu sood interested to do in hindi remake of krack
close
Published : 18/01/2021 01:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సోనూసూద్‌ హీరోగా ‘క్రాక్‌’ రీమేక్‌..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: సోనూసూద్‌ హీరోగా మారనున్నాడట. ఇటీవల విడుదలై ప్రేక్షకులను అలరిస్తున్న ‘క్రాక్‌’ను హిందీలో రీమేక్‌ చేయాలని భావిస్తున్నాడని తెలుస్తోంది. బీటౌన్‌లో సాగుతున్న చర్చ ఇది. ఇటీవల మాస్‌ మహారాజ్‌ రవితేజ హీరోగా నటించిన ‘క్రాక్‌’ విడుదలై ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పుడీ సినిమాను హిందీలో రీమేక్‌ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. అందులో ప్రధానపాత్ర పోషించేందుకు సోనూసూద్‌ ఆసక్తిగా ఉన్నట్లు చెప్పాడట. అయితే.. దీనికి సంబంధించి ఇప్పటివరకైతే ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. కానీ.. ‘క్రాక్‌’ సినిమాలో రవితేజ చేసిన పోలీస్‌ పాత్ర నచ్చడంతో ఈ సినిమాను ఎలాగైనా హిందీలో రీమేక్‌ చేయాలని సోనూ భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల.. ‘ఇక నేను విలన్‌ పాత్రలు చేయను.. హీరోగా చేయాలనుకుంటున్నా’ అని సోనూసూద్‌ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి.

మాస్‌మహారాజ్‌ రవితేజ, డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో వచ్చిన ‘క్రాక్‌’ మంచి విజయం సాధించింది. ఈ సినిమా జనవరి 9న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శృతిహాసన్‌ కథానాయిక. సముద్రకని, వరలక్ష్మీశరత్‌కుమార్‌ కీలక పాత్రల్లో నటించారు. తమన్‌ సంగీతం అందించాడు. మధు నిర్మాత. ఇటీవల చిత్రబృందం విశాఖపట్నంలో విజయోత్సవ సభ కూడా చేసింది.

ఇదీ చదవండి..

ఫొటోలతో ఫిదా చేస్తున్న నటిమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని