40 పేజీల సారాంశం చేతికిచ్చింది: సూర్య - sudha given 40 pages of synopsis says suriya
close
Published : 11/10/2020 23:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

40 పేజీల సారాంశం చేతికిచ్చింది: సూర్య

‘ఆకాశం నీ హద్దురా!’.. ఇలా తీశారు

చెన్నై: దర్శకురాలు సుధా కొంగర స్క్రిప్టుకు బదులుగా 40 పేజీల సారాంశంతో కూడిన పుస్తకాన్ని చేతికిచ్చారని తమిళ కథానాయకుడు సూర్య అన్నారు. ఆయన నటించిన సినిమా ‘ఆకాశం నీ హద్దురా!’. ఎయిర్‌ డెక్కన్‌ వ్యవస్థాపకుడు జీఆర్‌ గోపీనాథ్‌ జీవితం ఆధారంగా రూపొందించారు. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబరు 30న ఓటీటీ వేదికగా విడుదల కాబోతోంది. ప్రముఖ నటుడు మోహన్‌బాబు ఇందులో కీలక పాత్ర పోషించారు. అపర్ణ బాలమురళీ కథానాయికగా నటించారు. దాదాపు రూ.15 కోట్ల బడ్జెట్‌తో 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, సిఖ్యా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ‘స్క్రిప్టు టు స్క్రీన్‌’ మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు. ఇందులో యూనిట్‌ సభ్యులు తమ అనుభవాల్ని పంచుకున్నారు. పదేళ్ల క్రితం కెప్టెన్‌ గోపీనాథ్‌ ఇంటర్వ్యూ చూశానని, అప్పుడు ‘సాలా ఖడూస్‌’ (తెలుగులో ‘గురు’) కథ రాశానని సుధ చెప్పారు. ఆపై ‘సింప్లీ ఫ్లై’ పుస్తకం చదివిన తర్వాత చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించిందని వివరించారు.

సూర్య మాట్లాడుతూ.. ‘ఈ సినిమాకు అన్నీ సమకూరక ముందే సుధ 40 పేజీల సారాంశంతో కూడిన పుస్తకాన్ని నాకు ఇచ్చారు. ‘ఇది మీకు సరిపోతుందో? లేదో? నాకు తెలియదు. ఒక్కసారి చదవండి’ అని చెప్పారు. అది చదివిన తర్వాత  నాకు ఎంతో ఉత్సుకతగా అనిపించింది. సినిమా షూటింగ్‌ ప్రారంభించడానికి ముందే సుధ యూనిట్‌ సభ్యులతో స్క్రిప్టు సెషన్‌ నిర్వహించారు. దాని వల్ల అందరికీ తమ పాత్రలపై ఓ అవగాహన ఏర్పడింది. ఓ వ్యక్తి జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉంటాయి. సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది అలాంటి వ్యక్తి కథ. నా జీవితంలో ఎంతో ముఖ్యమైన సినిమా ఇది. ఇందులో నటించడం కొత్త అనుభవాన్ని ఇచ్చింది’ అని చెప్పారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని