సుందర్‌ శతకం సాధించినట్లే: గావస్కర్‌ - sundar very good player his runs as good as hundred says gavaskar
close
Updated : 09/02/2021 06:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సుందర్‌ శతకం సాధించినట్లే: గావస్కర్‌

ఇంటర్నెట్‌డెస్క్: ఆఖరి వరకు క్రీజులో నిలిచి ఇంగ్లాండ్ ఆధిక్యాన్ని తగ్గించిన టీమిండియా ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్ సుందర్‌ను దిగ్గజ క్రికెటర్ సునిల్‌ గావస్కర్‌ కొనియాడాడు. సుందర్‌ సాధించిన 85* పరుగులు శతకంతో సమానమని అన్నాడు. 192/5 స్కోరుతో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్‌కు వచ్చిన సుందర్ కీలక ఇన్నింగ్స్‌ ఆడిన విషయం తెలిసిందే. అశ్విన్‌ (31)తో కలిసి ఏడో వికెట్‌కు 80 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

‘‘సుందర్‌-అశ్విన్ 80+ పరుగుల భాగస్వామ్యంతో టీమిండియా పోటీలోకి వచ్చింది. వారిద్దరు పరుగులు సాధించకపోతే ఇంగ్లాండ్‌కు 241 పరుగుల ఆధిక్యం బదులుగా 341 పరుగులు వచ్చేవి. అంతేగాక వాళ్ల పోరాటం వల్ల భారత బౌలర్లకు మంచి విశ్రాంతి లభించింది. ఇక సుందర్‌ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతడు ఆడిన కొన్ని షాట్లు అమోఘం. అండర్సన్‌ బౌలింగ్‌లో లాఫ్టెడ్‌ షాట్‌తో సిక్సర్‌, రూట్ వేసిన బంతిని సిక్సర్‌గా మలిచిన తీరు సూపర్‌. అయితే అతడు శతకం సాధించాల్సింది. కానీ చేయలేకపోయాడు. ఏడో స్థానంలో వచ్చే బ్యాట్స్‌మెన్‌ ఎక్కువగా సెంచరీలు చేయలేరు. అయితే అతడు అజేయంగా చేసిన 85 పరుగులు శతకంతో సమానం’’ అని గావస్కర్‌ అన్నాడు.

ఇదీ చదవండి

లోకల్‌ బాయ్స్‌ ఆల్‌రౌండ్‌ షోమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని