close
Published : 20/01/2021 14:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పెళ్లి ప్లాన్స్‌ బయటపెట్టిన తాప్సీ

బాయ్‌ఫ్రెండ్‌ గురించి పెదవి విప్పిన ముద్దుగుమ్మ

ముంబయి‌: తాప్సీ ప్రస్తుతం వరుస అవకాశాలతో బాలీవుడ్‌లో రాణిస్తున్నారు. విభిన్న కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా తన ప్రియుడు మథియాస్‌ బో  గురించి, పెళ్లి ప్రణాళికల‌ గురించి స్పందించారు. ‘రష్మీ రాకెట్’ చిత్రీకరణలో పాల్గొంటున్న తాప్సీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

‘నా వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలను ఎప్పుడూ వేర్వేరుగానే చూస్తాను. అందుకే ఇండస్ట్రీకి చెందిన వ్యక్తితో డేటింగ్‌ చేయాలని భావించలేదు. నా జీవితంలో ఎంతో ముఖ్యమైన వారి పుట్టినరోజులను పురస్కరించుకుని సోషల్‌మీడియా వేదికగా ఫొటోలు షేర్‌ చేస్తాను. మథియాస్‌ బో బర్త్‌డేకు కూడా అదే చేస్తాను’

‘కెరీర్‌పరంగా ఇంకా ఎన్నో సాధించాలనే ఆలోచన నాలో ఉంది. ఆశించిన స్థాయికి చేరుకున్నాక పెళ్లి గురించి ఆలోచిస్తా. ప్రస్తుతం ఏడాదికి ఐదారు సినిమాలు చేస్తున్నాను. పెళ్లి, వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించాలని భావించినప్పుడు ప్రాజెక్ట్‌ల ఎంపికలో కాస్త నిదానంగా ఉంటాను’ అని తాప్సీ వివరించారు.

ఇదీ చదవండి

అప్పట్లో ఎంతో బాధపడ్డా: విజయ్‌ దేవరకొండ


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని