ఆ మాటలు వినిపిస్తున్నాయి - tamanna on 11 hour web series
close
Published : 12/04/2021 10:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ మాటలు వినిపిస్తున్నాయి

హైదరాబాద్‌: ‘‘సమాజం ఎంతో ముందుకు వెళుతున్నా.. ఆడవాళ్లు ఇంకా అది చేయలేరు. ఇది చేయడానికి వాళ్లు పనికిరారు అనే మాటలు వినిపిస్తున్నాయి.’’ అంటోంది అందాల నటి తమన్నా. ‘ఎఫ్‌2’, ‘గుర్తుందా శీతాకాలం’, ‘అంధాదున్‌’ తెలుగు రీమేక్‌లో నితిన్‌తో కలిసి నటిస్తున్న ఈ భామ.. ఇటీవలే ఓ వెబ్‌సిరీస్‌ పూర్తి చేసింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ...‘‘నేను ఏ పాత్రైనా శక్తివంచన లేకుండా నటిస్తా. 100శాతం సామర్థ్యంతోనే పనిచేస్తా. ఇలా వివిధ రంగాల్లోని మహిళలు తమ బాధ్యతల్లో వందశాతం శక్తి  సామర్థ్యాలను ఉపయోగిస్తారు. అయినా ఇంకా వారి మీద సమాజంలో పూర్తిస్థాయి నమ్మకం కలగడం లేదు. ఇది తొలగిపోయినప్పుడు... మహిళలకు మరిన్ని అవకాశాలు వస్తాయి. వారు మరింతగా ఎదుగుతారు’’ అని చెప్పుకొచ్చింది. ‘‘థియేటర్లో సినిమా చూడటం అద్భుతమైన అనుభూతి కలిగిస్తుంది. అలాగే ఓటీటీకి ఉండే అవకాశాలు ఓటీటీకి ఉన్నాయి. ఇక్కడ కథను ఎంత వివరంగానైనా చెప్పవచ్చు. నటనలో భిన్నత్వం ప్రదర్శించే వీలు కలుగుతుంది. దర్శకులకు స్వేచ్ఛ లభిస్తుంది.’’ అని చెప్పుకొచ్చింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని