టీచర్లకు, రాజకీయ నాయకులకు వ్యాక్సిన్‌ - tamil nadu seeks to vaccinate elderly politicians teachers on priority
close
Published : 20/02/2021 20:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీచర్లకు, రాజకీయ నాయకులకు వ్యాక్సిన్‌

కేంద్రాన్ని అనుమతి కోరిన తమిళనాడు ప్రభుత్వం

చెన్నై: తమిళనాడులో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అరవైఏళ్లు పైబడినవారితో పాటు రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు, పాత్రికేయులకు వ్యాక్సిన్‌ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్రం అనుమతించినట్లు అధికారులు వెల్లడించారు. ఎన్నికల సమయంలో విధులు నిర్వర్తించే వారికి వ్యాక్సిన్లు అందించడం ముఖ్యమని వారు తెలిపారు. మొదటిదశ వ్యాక్సిన్‌ పంపిణీలో భాగంగా ఇప్పటి వరకు 50శాతం మందికి టీకాలు అందిచామన్నారు.

కరోనా కారణంగా సాధారణ వైద్య పరీక్షలు కూడా చేయించుకోకుండా చాలా మంది వృద్ధులు ఇళ్లకే పరిమితమై ఉన్నారని తమిళనాడు ఆరోగ్య కార్యదర్శి డాక్టర్‌ రాధాక్రిష్ణన్‌ తెలిపారు. రోజుకు ఎనభైవేల మందికి వ్యాక్సిన్లు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా.. కేవలం 20 వేల మంది మాత్రమే వస్తున్నారని ఆయన వెల్లడించారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడులో ఆరోగ్యసిబ్బంది టీకా తీసుకోవడానికి సుముఖత వ్యక్తం చేయట్లేదని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారం ప్రారంభమయ్యే నాటికి వ్యాక్సిన్‌ పంపిణీ పూర్తైతే కరోనా వ్యాప్తిని కొంత వరకూ తగ్గించొచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని