అందుకు క్షమాపణలు చెబుతున్నా: తనికెళ్ల భరణి - tanikella bharani give apolgies
close
Published : 16/04/2021 01:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అందుకు క్షమాపణలు చెబుతున్నా: తనికెళ్ల భరణి

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏ మనిషికీ ఇతరుల మనసును నొప్పించే హక్కు  లేదని.. తాను ఎవరికీ వ్యతిరేకం కాదని ప్రముఖ నటుడు, దర్శకుడు తనికెళ్ల భరణి అన్నారు. కొద్దిరోజుల కిందట ఆయన ఫేస్‌బుక్‌లో పెట్టిన ఒక పోస్టుపై కొంతమంది నుంచి అభ్యంతరం వ్యక్తం అయింది. ఈ నేపథ్యంలో తనికెళ్ల భరణి స్పందించారు. ఈ మేరకు ట్విటర్‌లో ఒక వీడియో పంచుకున్నారు.

‘‘గత కొన్ని రోజులుగా ‘శభాష్‌ రా శంకరా..’ అంటూ ఫేస్‌బుక్‌లో పోస్టూ చేస్తూ వస్తున్నా. అయితే.. దురదృష్టవశాత్తూ కొన్ని వ్యాఖ్యలు కొంతమంది మనసును నొప్పించాయని తెలిసింది. ఇక దానికి నేను వివరణ ఇచ్చుకోదలుచుకోలేదు. చేతులు జోడించి బేషరతుగా క్షమాపణలు చెబుతున్నా. అలాగే ఆ పోస్టు తొలగించాను. నాకు హేతువాదులన్నా.. మానవతావాదులన్నా గౌరవమే తప్పితే వ్యతిరేకత లేదు. అలాగే ఏ మనిషినీ నొప్పించే హక్కు, అధికారం ఎవరికీ లేదు. అందుకే జరిగిన పొరపాటుకు మరోసారి మన్నించమని కోరుతున్నా’ అని అందులో పేర్కొన్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని