అజాగ్రత్త వద్దు మిత్రమా.. కరోనా కోరలు చాచింది  - team india captain virat kohli appeals all people to strictly follow covid protocols
close
Published : 21/04/2021 01:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అజాగ్రత్త వద్దు మిత్రమా.. కరోనా కోరలు చాచింది 

విరాట్‌ కోహ్లీ వీడియో పంచుకున్న దిల్లీ పోలీసులు

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సారథి విరాట్‌ కోహ్లీ కరోనా వైరస్‌ నివారణపై దేశ ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేశాడు. ప్రస్తుతం భారత్‌లో రెండో దశ వ్యాప్తి తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా ముంబయి, దిల్లీలాంటి మెట్రో నగరాల్లో పరిస్థితి ఘోరంగా మారింది. నిత్యం వేలాది కేసులు నమోదవుతుండగా వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలోనే పలు రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూ, వారంతపు లాక్‌డౌన్‌ పాటిస్తున్నాయి. అయితే, ప్రజలు నిర్లక్ష్యం వీడి స్వీయ జాగ్రత్తలు పాటించకపోతే మరిన్ని దారుణ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని విరాట్‌ కోహ్లీ హెచ్చరించాడు.

‘మిత్రులారా రోజురోజుకూ కరోనా వైరస్‌ ఎలా వ్యాప్తి చెందుతుందో మీ అందరికీ తెలిసిందే. ఇంతకుముందే చెప్పాను. మళ్లీ చెప్తున్నా.. ఏదైనా నిత్యవసర సరుకులకు లేదా ముఖ్యమైన పనుల మీద బయటకు వెళితే తప్పకుండా మాస్కులు ధరించండి. ఎల్లప్పుడూ శానిటైజర్లు వాడండి. అలాగే భౌతిక దూరం పాటించండి. వైరస్‌ను నివారించాలంటే ఈ జాగ్రత్తలన్నీ ఎంతో ముఖ్యం. ఈ విషయంలో పోలీసులు ఎంతగానో కృషి చేస్తున్నారు. మీరు కూడా వారికి సహకరించి జాగ్రత్తగా ఉండండి. మీరు బాగుంటేనే దేశం బాగుంటుంది. జై హింద్‌’ అని కోహ్లీ వీడియోలో చెప్పుకొచ్చాడు. కాగా, గతేడాది లాక్‌డౌన్‌ విధించినప్పుడు కూడా టీమ్‌ఇండియా సారథి ఇలాగే తన అభిమానులకు సూచించాడు. కరోనాను నియంత్రించడంలో ప్రతి ఒక్కరు కృషిచేయాలని కోరాడు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని