Vijay Devarakonda: నాకంటే ముందు నా తమ్ముడు ఆనంద్‌కే పెళ్లి - telugu enws devarakonda brothers special interview promo
close
Updated : 24/10/2021 11:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Vijay Devarakonda: నాకంటే ముందు నా తమ్ముడు ఆనంద్‌కే పెళ్లి

హైదరాబాద్‌: తనకంటే ముందు తన సోదరుడు ఆనంద్‌కే వివాహం జరుగుతుందని టాలీవుడ్‌ సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ అన్నారు. ఆనంద్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘పుష్పకవిమానం’ మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈసినిమాలో ఆనంద్‌ అమాయకుడైన యువకుడి పాత్రలో నటించారు. దామోదర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి విజయ్‌ దేవరకొండ నిర్మాతగా వ్యవహించారు. కాగా, ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దేవరకొండ బ్రదర్స్‌ ఓ స్పెషల్‌ చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. తమ జీవితాల్లో జరిగిన ఆసక్తికర సంఘటనలను అన్నదమ్ములిద్దరూ సరదాగా పంచుకున్నారు. ఈవిషయాన్ని తెలియజేస్తూ తాజాగా విజయ్‌ ఓ స్పెషల్‌ ప్రోమో షేర్‌ చేశారు.

‘‘స్కూల్‌లో చదువుకునే రోజుల్లో వేసవి కాలం సెలవులకు ఇంటికి వచ్చేవాళ్లం. రెండు నెలలు ఇంట్లోనే సరదాగా ఉండేవాళ్లం. ఆనంద్‌ మాత్రం నాకు చుక్కలు చూపించేవాడు. నన్ను బాగా విసిగించేవాడు’’ అని విజయ్‌ చెప్పగానే.. ఆనంద్‌ నవ్వులు పూయించారు. అనంతరం విజయ్‌.. ‘‘నాకంటే ముందు ఆనంద్‌కే పెళ్లి అవుతుంది’’ అనగానే.. ‘‘నో అన్నయ్యకే ముందు’’ అని ఆనంద్‌ సైగలు చేశారు. ‘‘అమ్మ ఫెవరెట్ ఎవరు’’ అనేదానికి సమాధానం చెబుతూ.. తానే అన్నట్లు ఇద్దరూ సమాధానం ఇచ్చుకున్నారు. ఇలా, ఎంతో సరదాగా సాగిన దేవరకొండ సోదరుల ఫన్నీ ఇంటర్వ్యూ పూర్తిగా చూడాలంటే రేపటి వరకూ వేచి చూడాల్సిందే. రేపు ఈ వీడియో విడుదల చేయనున్నారు.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని