Khiladi: దుబాయ్‌లో ‘ఖిలాడి’ ఆటపాట - telugu news Khiladi Shooting goes On In Dubai
close
Updated : 23/10/2021 10:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Khiladi: దుబాయ్‌లో ‘ఖిలాడి’ ఆటపాట

వితేజ హీరోగా రమేష్‌ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఖిలాడి’. సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయాతి కథానాయికలు. ముగింపు దశలో ఉన్న ఈ సినిమా.. ప్రస్తుతం దుబాయ్‌లో చిత్రీకరణ జరుపుకొంటోంది. ఇందులో భాగంగా రవితేజ, మీనాక్షి, డింపుల్‌ హయాతిలపై ఓ అందమైన పాట తెరకెక్కిస్తున్నారు. ఈ గీతానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలందించగా.. యశ్వంత్‌ మాస్టర్‌ నృత్యరీతులు సమకూరుస్తున్నారు. ‘‘మంచి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ప్రేక్షకుల్ని థ్రిల్‌ చేసేందుకు రమేష్‌ వర్మ అద్భుతమైన కథ సిద్ధం చేశారు. ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయంతో అలరించనున్నారు. శుక్రవారం నుంచే దుబాయ్‌లో పాట చిత్రీకరణ మొదలైంది. ఇక్కడే కాక మస్కట్‌లోని కొన్ని ప్రదేశాల్లోనూ ఈ గీతాన్ని తెరకెక్కించనున్నాం’’ అని చిత్ర బృందం తెలియజేసింది. కూర్పు: అమర్‌ రెడ్డి, ఛాయాగ్రహణం: సుజిత్‌ వాసుదేవ్‌, జీకే విష్ణు.

‘ధమాకా’ కబురు: రవితేజ.. నక్కిన త్రినాథరావు కలయికలో ‘ధమాకా’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. డబుల్‌ ఇంపాక్ట్‌.. అన్నది ఉపశీర్షిక. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటీవలే చిత్రీకరణ ప్రారంభించుకున్న ఈ సినిమా.. తాజాగా తొలి షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం సామాజిక మాధ్యమాల తెలియజేసింది. ఈ సందర్భంగా సెట్లో చిత్ర యూనిట్‌తో దిగిన ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ఆ ఫొటోలో దర్శకుడు కథానాయిక శ్రీలీల, దర్శకుడు శ్రీనాథరావుతో పాటు ఇతర సాంకేతిక నిపుణులు కనిపించారు. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న మరో సినిమా ‘రామారావు’ చిత్రీకరణ దశలోనే ఉంది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని