Ap Highcourt: ఆర్థిక శాఖ కార్యదర్శికి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ - telugu-news-ap high court issues non bailable warrant on finance secretary satyanarayana
close
Updated : 24/07/2021 16:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Ap Highcourt: ఆర్థిక శాఖ కార్యదర్శికి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణపై హైకోర్టు చర్యలకు ఆదేశించింది. సత్యనారాయణపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసిన హైకోర్టు.. అదుపులోకి తీసుకోవాలని ఆదేశించింది. కలిదిండి పంచాయతీ కార్యదర్శికి బకాయిలు చెల్లించాలని గతంలో సత్యనారాయణకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలు అమలు చేసినప్పటికీ గత వాయిదాకు ఆయన ఆలస్యంగా హాజరయ్యారు. సత్యనారాయణ కోర్టు ధిక్కరణ చర్యలకు పాల్పడ్డారని.. కేసు విచారణలో కోర్టుకు ఆలస్యంగా వచ్చారని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. వారెంట్‌ రీకాల్‌ కోసం సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. జైలు శిక్షతో పాటు రూ.50వేల జరిమానా ఉంటుందని తెలిపింది. రూ.50వేల జరిమానాను న్యాయవాదుల సంక్షేమ నిధికి చెల్లించాలని ఆదేశించింది.

అనంతరం శిక్ష నిలిపివేయాలంటూ సత్యనారాయణ, ఆయన తరఫు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. వారి అభ్యర్థనను పరిశీలించిన ధర్మాసనం.. సత్యనారాయణకు జైలు శిక్ష అమలును వాయిదా వేస్తూ రూ.10 జరిమానా విధించింది. కేసు విచారణ సోమవారానికి వాయిదా వేసింది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని