Bigg Boss Telugu 5: చెంప పగలకొడతానని ఎన్ని సార్లు అంటావ్‌ ప్రియ: నాగార్జున - telugu news bigg boss telugu 5 latest promo nagarjuna priya
close
Updated : 23/10/2021 16:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bigg Boss Telugu 5: చెంప పగలకొడతానని ఎన్ని సార్లు అంటావ్‌ ప్రియ: నాగార్జున

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘చెంప పగలకొడతాను.. చెంప పగలకొడతానని ఎన్ని స్లార్లు అంటావ్‌’ అని ప్రియని ప్రశ్నించారు నాగార్జున. ‘బిగ్‌బాస్‌’ కార్యక్రమానికి నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. శని, ఆదివారాల్లో ఆయన హౌజ్‌మేట్స్‌తో మాట్లాడుతూ సందడి చేస్తుంటారు. ఎప్పటిలానే ఈవారం ఆయన తన టైమింగ్‌తో అలరించారు. ఈ రోజు ప్రసారంకానున్న ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో ఈ విశేషాల్ని అందించింది. ‘గేమ్‌ బ్రహ్మాండంగా ఆడుతున్నావ్‌. సిరి దగ్గర స్టిక్కర్లు దొంగతనం చేశావ్‌?’ అంటూ రవిని నాగార్జున ఆటపట్టించారు. ఆ తర్వాత ప్రియతో మాట్లాడారు. ‘చెంప పగలకొడతాను.. చెంప పగలకొడతాను.. చెంప పగలకొడతానని ఎన్నిసార్లు అంటావ్‌. ఎందుకు అలా అన్నావ్‌’ అని ప్రియని అడిగారు. ‘మాట వరకూ ఒకే. కానీ, పక్కనున్న తొట్టెను తీసుకుని సన్నీపై కోపం ప్రదర్శించావ్‌’ అనగానే నేను అది చూడలేదు సర్‌ అని సన్నీ సమాధానమిచ్చాడు. ‘చూసినా ఏం చేస్తావులే’ అంటూ నాగార్జున నవ్వులు పూయించారు. యానీ మాస్టర్‌ తను ఎదుర్కొంటున్న సమస్యని నాగార్జునకి వివరించారు. ఈ హంగామా చూడాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. 



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని