HRC: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఆయన సోదరుడిపై హెచ్చార్సీలో ఫిర్యాదు - telugu news complaint lodged against Minister Srinivas Gowd and his brother in hrc
close
Updated : 29/07/2021 06:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

HRC: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఆయన సోదరుడిపై హెచ్చార్సీలో ఫిర్యాదు

నారాయణగూడ, న్యూస్‌టుడే: రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఆయన సోదరుడు శ్రీకాంత్‌గౌడ్‌ల నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన విశ్వనాథరావు, పుష్పలత దంపతులు బుధవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ (ఎస్‌హెచ్‌ఆర్‌సీ)ని ఆశ్రయించారు. 2018 ఎన్నికల సమయంలో ఓ కేసులో శ్రీనివాస్‌గౌడ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పామని అక్రమ కేసులు పెట్టించి వేధింపులకు పాల్పడుతున్నారని కమిషన్‌ దృష్టికి తీసుకొచ్చారు. సీఐ మహేశ్వర్‌తో అర్ధరాత్రి వేళలో ఇంటిపై దాడులు చేయిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఓ పైవేటు సంస్థలో పనిచేస్తున్న తమ ఇద్దరినీ ఉద్యోగాల్లోంచి తీయించేశారని ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా వేధింపులు ఆగకపోతే మంత్రి, ఆయన సోదరుడి పేర్లతో లేఖ రాసి ఠాణా ముందు ఆత్మహత్య చేసుకుంటామని ఫిర్యాదులో పేర్కొన్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని